IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టింది. లక్నోపై ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసిది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 147 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చేజ్ చేసింది. ఇక, బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నోని బెంబేలెత్తించారు. సలామ్ 4 వికెట్లతో రాణించాడు. భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్య 2 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో బెంగళూరుకి ఇది వరుసగా రెండో విజయం. ఓవరాల్ గా నాలుగో గెలుపు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి వచ్చేసింది ఆర్సీబీ. మరోవైపు లక్నోకి ఇది వరుసగా రెండో ఓటమి.
