Love Today: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్ టుడే.. ఎప్పుడంటే?

తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ టుడే’ స్టార్ మా ఛానల్‌లో ఏప్రిల్ 9న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

Love Today: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్ టుడే.. ఎప్పుడంటే?

Love Today Movie Locks World Television Premiere Date

Love Today: తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ టుడే’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రదీప్ రంగనాథ్ స్వయంగా డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకు యూత్ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. తమిళంలో తెరకెక్కిన లవ్ టుడే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయగా, ఈ సినిమాకు ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Love Today : బాలీవుడ్‌కి వెళుతున్న లవ్ టుడే.. ఈ రీమేక్ అయినా హిట్ అవుతుందా?

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ మా ఛానల్‌లో ఏప్రిల్ 9న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో మరోసారి ఈ సినిమాను బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని సబ్జెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Love Today : కోట్లు కురిపించిన చిన్న సినిమా.. 100 రోజుల లవ్ టుడే..

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన లవ్ టుడే బుల్లితెరపై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆస్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు సత్యరాజ్, రాధికా ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.