Manirathnam : త్రిష, ఐశ్వర్యారాయ్‌లపై చాలాసార్లు సీరియస్ అయ్యా.. షూటింగ్ అయ్యేదాకా వాళ్ళిద్దర్నీ మాట్లాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చా..

మణిరత్నం మాట్లాడుతూ.. ''షూటింగ్‌ టైంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో బాగానే ఇబ్బంది పడ్డాను. ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యల మధ్య సీన్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. షూటింగ్‌ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య............

Manirathnam : త్రిష, ఐశ్వర్యారాయ్‌లపై చాలాసార్లు సీరియస్ అయ్యా.. షూటింగ్ అయ్యేదాకా వాళ్ళిద్దర్నీ మాట్లాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చా..

Mani Ratnam is serious on Trisha and Aishwarya Rai during the shooting time

Manirathnam :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో డైరెక్టర్ మణిరత్నం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Neha Chowdary : రేవంత్ వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. రివేంజ్ అవకాశం వస్తే వదలను..

మణిరత్నం మాట్లాడుతూ.. ”షూటింగ్‌ టైంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో బాగానే ఇబ్బంది పడ్డాను. ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యల మధ్య సీన్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. షూటింగ్‌ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌నెస్‌ వచ్చేది కాదు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల ఆ సీరియస్ రాక సీన్స్‌ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్‌ చేసేటప్పుడు మాత్రం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళ సీన్స్ వల్ల మరింత ఆలస్యం అయ్యేది. దీంతో సినిమా అయిపోయేవరకు అసలు వాళ్ళిద్దర్నీ మాట్లాడుకోవద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చాను. అయినా వాళ్ళు వినలేదు, దీంతో చాలా సార్లు షూట్ లో వాళ్ళిద్దరిపైనా సీరియస్ అయి అరిచేశాను కూడా” అని తెలిపారు.