Chiranjeevi : అల్లు అర్జున్‌కు స్వీట్ తినిపించి అభినందించిన చిరంజీవి

అల్లు అర్జున్ కు పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ద‌క్కింది. శ‌నివారం బ‌న్నీ త‌న మేన‌త్త నివాసానికి వెళ్లారు. అక్క‌డ త‌న సినీ రంగంలో త‌న గురువుగా చెప్పుకునే త‌న మామ‌య్య చిరంజీవిని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Chiranjeevi : అల్లు అర్జున్‌కు స్వీట్ తినిపించి అభినందించిన చిరంజీవి

Chiranjeevi appreciate Allu Arjun

Updated On : August 26, 2023 / 8:09 PM IST

Chiranjeevi-Allu Arjun : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో గొప్ప న‌టులు ఉన్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అంద‌ని ద్రాక్ష‌గానే ఉండ‌గా ఆ లోటును తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తీర్చాడు. పుష్ప సినిమాలోని పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ న‌ట‌న‌కు గాను 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ న‌టుడి అవార్డును అందుకున్నాడు. దీంతో మెగా, అల్లు కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అల్లు అర్జున్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Chiranjeevi appreciate Allu Arjun

Chiranjeevi appreciate Allu Arjun

త‌న‌కు అవార్డు వ‌చ్చింద‌ని తెలియ‌గానే ముందుగా బ‌న్నీ షాకైయ్యారు. తేరుకున్న వెంట‌నే త‌న తండ్రి అల్లు అర‌వింద్ పాదాల‌కు న‌మ‌స్కారం చేశారు. ఆ త‌రువాత త‌న భార్య‌, పిల్ల‌ల‌ను ఆప్యాయంగా హ‌త్తుకున్నారు. ఇక శ‌నివారం బ‌న్నీ త‌న మేన‌త్త నివాసానికి వెళ్లారు. అక్క‌డ త‌న సినీ రంగంలో త‌న గురువుగా చెప్పుకునే త‌న మామ‌య్య చిరంజీవిని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Chiranjeevi appreciate Allu Arjun

Chiranjeevi appreciate Allu Arjun

బ‌న్నీని చిరు అభినందిచ‌డంతో పాటు పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఎంతో మురిపంగా బ‌న్నీకి చిరు స్వీట్ తినిపించి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా బ‌న్నీని అభినందించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.