MegaStar Chiranjeevi : చిన్న సినిమాకి ‘మెగా’ సాయం.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా మెగాస్టార్..
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఆగస్టు 31న హైదరాబాద్ లో..............

MegaStar Chiranjeevi as chief gurst for Firstday Firstshow movie Pre Release Event
MegaStar Chiranjeevi : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా అతని దగ్గర సహాయ దర్శకులుగా పని చేసిన వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. కొత్త వాళ్ళతో కామెడీ ఎంటర్టైనర్ గా, పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అనే కాన్సెప్టుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
శంకరాభరణం లాంటి ఎన్నో క్లాసిక్స్ సినిమాలు అందించిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఆగస్టు 31న హైదరాబాద్ లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు అని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరగడమే కాక ఈవెంట్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిన్న సినిమాకి మెగా సాయం అందిస్తున్నారని, ఇలాంటి వాటిల్లో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని మెగాస్టార్ ని అభినందిస్తున్నారు.