Naga Shaurya : ‘కృష్ణ వ్రింద విహారి’ గా నాగ శౌర్య..

యంగ్ హీరో నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా ‘కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్..

Naga Shaurya : ‘కృష్ణ వ్రింద విహారి’ గా నాగ శౌర్య..

Krishna Vrinda Vihari

Naga Shaurya: యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అశ్వథ్ధామ’ తర్వాత ‘వరుడు కావలెను’ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘లక్ష్య’ వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.

Lakshya Movie : ‘ఆహా’ లో ‘లక్ష్య’ సెన్సేషన్!

నేడు నాగ శౌర్య పుట్టినరోజు (జనవరి 22). ఈ సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం. శౌర్య నటిస్తున్న 22వ సినిమా ఇది. తండ్రి ప్రసాద్ ముల్పూరి సమర్పణలో, హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో, తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు.

Jr NTR : ఫ్యాన్ వార్‌కి ఫుల్ స్టాప్.. వైరల్ అవుతున్న ‘సింహాద్రి’ ఓపెనింగ్ ఫొటో..

‘అలా ఎలా’, ‘లవర్’, ‘గాలి సంపత్’ చిత్రాల దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ‘కృష్ణ వ్రింద విహారి’ అనే బ్యూటిఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. నాగ శౌర్య ట్రెడిషనల్ లుక్‌లో బాగున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.