మహర్షి కాన్సెప్ట్ ఇదే.. నమ్రతా ఫొటోలతో చెప్పేసింది

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 09:17 AM IST
మహర్షి కాన్సెప్ట్ ఇదే.. నమ్రతా ఫొటోలతో చెప్పేసింది

Updated On : March 9, 2019 / 9:17 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న సినిమా ‘మహర్షి’కి సంబంధించి ఏ అప్‌డేట్ వస్తుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఈ క్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత విడుదల చేసిన రెండు ఫోటోలను ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో తీసినట్లు చెబుతున్న ఈ ఫోటోలలో చక్కటి పల్లటూరు వాతావరణం, పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. అరటి చెట్లు, పల్లెటూరి వాతావరణం చూస్తుంటే సినిమా వర్గాల ద్వారా ఇప్పటివరకు వినిపించిన సబ్జెక్ట్ నిజమే అనిపిస్తుంది.
Read Also : చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

షూటింగ్ గ్యాప్‌లో సెట్‌లో తీసిన ఫోటోలు అంటూ నమ్రత షేర్ చేసిన ఫోటోలను పెడుతూ.. ఇందులో మహేశ్‌ స్మార్ట్‌గా కనిపించారు. ‘వృత్తిపట్ల ఎంతో మక్కువ ఉన్న, శ్రమించే ‘మహర్షి’ చిత్ర బృందంతో షూటింగ్‌ విరామ సమయంలో దిగిన ఫొటోలు’ అంటూ ‘బెస్ట్‌ ఈజ్‌ ఎట్‌ టు కమ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆ ఫోటోలకు ఆమె జత చేశారు. ఈ ఫొటోలను ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రం సెట్‌లో దిగినట్లు పెట్టిన ఫోటోలో మహేష్ బాబు కుమారుడు గౌతమ్‌ కూడా ఉన్నారు.

అయితే ఈ సినిమా రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని అర్థం అవుతుంది. వ్యవసాయ ఆధారిత దేశం అయిన మనదేశంలో పరిస్దితులు బాగోక, ప్రభుత్వాలు సహకరించక, వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు. పంట పొలాలను అమ్మేసుకోని రైతులు సిటీలకు వలసలు పోతున్నారు. మరికొంతమంది  అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి విషయాన్నే ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. కమర్షియల్ హంగులతో శ్రీమంతుడు వంటి గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో సినిమాలను తీసిన మహేష్.. ఆధునిక పద్దతులతో చేస్తే వ్యవసాయం దండగ కాదు  వ్యవసాయం పండగ అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా చూపబోతున్నట్లు తెలుస్తుంది. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్‌గా నటిస్తుంది. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రలో చేస్తుండగా ఈ సినిమాను అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమామే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.