Neha Shetty : డీజే టిల్లు సీక్వెల్ లో నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్.. రాధిక మళ్లీ వచ్చేస్తుంది..

ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ఓ పాట బాగా వైరల్ అయ్యాయి. వీటితో ఈ సారి కూడా మరింత ఫన్ టిల్లు అందించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Neha Shetty : డీజే టిల్లు సీక్వెల్ లో నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్.. రాధిక మళ్లీ వచ్చేస్తుంది..

Neha Shetty will play a guest appearance in Siddhu Jonnalagadda Tillu Square Movie

Updated On : August 23, 2023 / 6:35 AM IST

Neha Shetty : టాలీవుడ్(Tollywood) లో ఎప్పట్నుంచో ఉన్నా ‘డీజే టిల్లు’(DJ Tillu) సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). చిన్న సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్లో నేహశెట్టి నటించి ఆ క్యారెక్టర్ బాగా వైరల్ అయ్యేలా చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టిల్లు స్క్వేర్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ఓ పాట బాగా వైరల్ అయ్యాయి. వీటితో ఈ సారి కూడా మరింత ఫన్ టిల్లు అందించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ లో డీజే టిల్లులోని రాధిక క్యారెక్టర్ చేసిన నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.

యూత్ లో, సోషల్ మీడియాలో నేహశెట్టి రాధిక క్యారెక్టర్ కి బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇది కూడా క్యాష్ చేసుకోవాలని నేహాతో ఓ గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పిస్తున్నాడట సిద్ధూ. ఈ విషయం తెలియడంతో నేహా అనుపమకు చెల్లి లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మొదటి పార్ట్ లో నేహా పగ ఇందులో అనుపమతో తీర్చే ప్లాన్ చేసిందేమో చివర్లో వచ్చి సిద్ధుకి షాక్ ఇస్తుందేమో అని నెటిజన్లు సొంత కథలు కామెంట్స్ చేసేస్తున్నారు.

Varun Tej : అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత.. ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది.. వరుణ్ తేజ్ ఆన్సర్!

ఇక నేహశెట్టి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే నేహావి ఏకంగా 3 సినిమాలు రిలీజ్ కానున్నాయి. బెదుర్లంక 2012 సినిమాతో రేపు ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ లో రూల్స్ రంజాన్ సినిమాతో రానుంది. ఆ తర్వాత గ్యాంగ్ అఫ్ గోదావరి సినిమాతో రానుంది. ఇప్పటికే ఈ సినిమాల సాంగ్స్ తో నేహా ఫుల్ క్రేజ్ ఇచ్చుకుంది. ఈ క్రేజ్ టిల్లు స్క్వేర్ కి ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో చూడాలి.