Laal Singh Chaddha: అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెనుకబడ్డ బడా సినిమాలు!

బాలీవుడ్ స్టార్ హీరోలు నటించే సినిమాలకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ నెలకొనేదో అందరికీ తెలిసిందే. ఎవరైనా స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అక్కడి థియేటర్ల వద్ద జనసంద్రం కనిపించేది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో హైజ్‌ఫుల్ బోర్డుల దర్శనమిచ్చేవి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఎవరైనా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే, వాటిని చూసేందుకు కూడా ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు.

Laal Singh Chaddha: అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెనుకబడ్డ బడా సినిమాలు!

Laal Singh Chaddha: బాలీవుడ్ స్టార్ హీరోలు నటించే సినిమాలకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ నెలకొనేదో అందరికీ తెలిసిందే. ఎవరైనా స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అక్కడి థియేటర్ల వద్ద జనసంద్రం కనిపించేది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో హైజ్‌ఫుల్ బోర్డుల దర్శనమిచ్చేవి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఎవరైనా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే, వాటిని చూసేందుకు కూడా ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు.

Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’కు తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

తాజాగా ఈ వారంలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు బడా సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రక్షా బంధన్’, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ రెండు సినిమాలు కూడా ఈ వారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో ఈ రెండింటిపై బాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలకు వారు చెబుతున్నట్లుగా బజ్ ఉన్నా, ప్రేక్షకుల్లో ఈ సినిమాను చూసే ఆసక్తి మాత్రం లేదని కనిపిస్తుంది.

Laal Singh Chaddha: అమీర్‌ఖాన్ భుజాలపై భారీ భారం.. బాలీవుడ్‌కు మళ్ళీ క్రేజ్ తెస్తాడా?

ఈ చిత్రాలకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా ప్రేక్షకులు ‘చూద్దాం లే..’ అనే వైఖరిలో ఉండటంతో ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలో పడిపోయారు. ఒకవేళ ఈ రెండు సినిమాలకు ఏమాత్రం నెగెటివ్ మౌత్ వర్డ్ వచ్చినా బాలీవుడ్ మళ్లీ కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని క్రిటిక్స్ అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు.. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు ఈ రెండు సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ రావడంతో బాలీవుడ్ వర్గాలు అవాక్కవుతున్నాయి. మరి బాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.