Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’కు తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించారు.

Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’కు తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

Laal Singh Chaddha: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే కాకుండి, ఇతర దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో అమీర్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రెజెంట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Laal Singh Chaddha : ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్న అమీర్ ఖాన్, చిరంజీవి..

ఇప్పటికే ఈ చిత్రాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చిరు దగ్గరుండి ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా చిరు ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని సోల్ తెలుగు ఆడియెన్స్‌కు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుందని చిరు అన్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి బింబిసార, సీతా రామం సినిమాలతో ప్రూవ్ చేశారని.. ఇప్పుడు రాబోతున్న ‘లాల్ సింగ్ చడ్డా’కు కూడా ఇలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారని చిరు ఆశించారు.

Laal Singh Chaddha: అమీర్‌ఖాన్ భుజాలపై భారీ భారం.. బాలీవుడ్‌కు మళ్ళీ క్రేజ్ తెస్తాడా?

ఇక ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటు స్టార్ బ్యూటీ కరీన కపూర్, అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తుండగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న రిలీజ్ చేస్తుండటంతో ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.