విజయ్ సేతుపతి, నిహారిక నటించిన “ఓ మంచి రోజు చూసి చెప్తా” ట్రైలర్ విడుదల

విజయ్ సేతుపతి, నిహారిక నటించిన “ఓ మంచి రోజు చూసి చెప్తా” ట్రైలర్ విడుదల

O Manchi Roju Chusi Chepta Movie Official Trailer1

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. నిహారిక కొణిదెల ఎప్పుడూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.

ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. మా చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాము” అని ఆయన వెల్లడించారు.