Tamannaah : మరోసారి కెమెరాకి చిక్కిన ప్రేమజంట..

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల ఈ భామ బాలీవుడ్ నటుడి విజయ్ వర్మతో ప్రేమలో పడింది అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ జంట కెమెరాకి చిక్కారు.

Tamannaah : మరోసారి కెమెరాకి చిక్కిన ప్రేమజంట..

Tamannaah and vijay varma

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల ఈ భామ ఒక బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడింది అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. నేచురల్ స్టార్ నాని MCA సినిమాలో విలన్ గా నటించిన ‘విజయ్ వర్మ’తో తమన్నా ప్రేమాయణం నడుపుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tamannaah : ఆ నటుడితో తమన్నా డేటింగ్.. నిజమేనా?

స్నేహితులతో కలిసి వీరిద్దరూ గోవా న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్నారు. ఇక పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకి రావడం.. దానిలో తమన్నా, విజయ్ వర్మ కిస్ చేసుకుంటూ సన్నిహితంగా కనిపించారు. ఆ నెక్స్ట్ డే ముంబై ఎయిర్ పోర్ట్ లో కూడా ఇద్దరు కలిసి రావడంతో.. తమన్నా ఆ నటుడితో రహస్య రేలషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తుంది అంటూ కథనాలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ జంట కెమెరాకి చిక్కారు.

నిన్న బాలీవుడ్ లో ఒక అవార్డు వేడుకకు హాజరయిన తమన్నా.. రెడ్ కార్పెట్ పై కెమెరాకు ఫోజులు ఇస్తుంది. ఆ సమయంలో అటు పక్కగా వెళ్తున్న విజయ్ వర్మ, తమన్నా ఫోటో షూట్ ని కావాలని డిస్ట్రబ్ చేస్తూ వెళ్ళాడు. ఇక విజయ్ ని చూసిన తమన్నా.. అతని పిలిచి కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో అండ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా వీరిద్దరూ మొదటిసారిగా ‘లవ్ స్టోరీస్-2’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. మరి కలిసి సినిమా చేయబోతుండడంతో సన్నిహితంగా ఉంటున్నారా? లేదా నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనేది తెలియాలి. ఇక ఈ భామ తెలుగులో చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల 17 నుంచి మొదలు కానుంది. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.