Ori Devuda Heroines: “నాటు నాటు” స్టెప్ వేసి అదరగొట్టిన విశ్వక్ సేన్ హీరోయిన్లు..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం "ఓరి దేవుడా". తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. హీరో విశ్వక్ సేన్ తన ఇంట దీపావళి వేడుకలు నిర్వహించాడు. ఈ సెలబ్రేషన్స్ లో...

Ori Devuda Heroines: “నాటు నాటు” స్టెప్ వేసి అదరగొట్టిన విశ్వక్ సేన్ హీరోయిన్లు..

Ori Devuda Heroines Dance steps for Naatu Naatu song

Ori Devuda Heroines: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం “ఓరి దేవుడా”. తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కి ఫాంటసీని జత చేయడంతో.. ఒక కొత్త కథని చూసిన అనుభవాన్ని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్.

దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. హీరో విశ్వక్ సేన్ తన ఇంట దీపావళి వేడుకలు నిర్వహించాడు. ఈ సెలబ్రేషన్స్ కు చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ లోని పలువురు హీరోలు కూడా హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే “ఓరి దేవుడా”లో నటించిన ఇద్దరు హీరోయిన్లు “నాటు నాటు” సాంగ్ కి స్టెప్ లు వేశారు.

మిథిలా పాల్కర్, ఆశా భట్.. ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి వేడుకలో RRR లోని నాటు నాటు పాటకు డాన్స్ చేసి ఇరగదీసారు. ఆ వీడియోని మిథిలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ “లవ్ గాడ్”గా ఒక ప్రత్యేక పాత్ర చేశాడు.