Ori Devuda Trailer: “ఓరి దేవుడా” ట్రైలర్ లాంచ్.. విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్ హంగామా మాములుగా లేదుగా!

టాలీవుడ్‌ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. వరుస ప్రేమకథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇక సినిమా ట్రైలర్ ను మూవీ టీం శుక్రవారం విడుదల చేసింది.

Ori Devuda Trailer: “ఓరి దేవుడా” ట్రైలర్ లాంచ్.. విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్ హంగామా మాములుగా లేదుగా!

Ori Devuda Movie Trailer Launch

Ori Devuda Trailer: టాలీవుడ్‌ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. వరుస ప్రేమకథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు.

Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా..!

ఈ సినిమాలో లవ్ గాడ్‌గా ఓ స్పెషల్ పాత్రలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. ఇక సినిమా ట్రైలర్ ను మూవీ టీం శుక్రవారం విడుదల చేసింది. అతడి ఇష్టం తెలియకుండానే, అమ్మాయి ప్రేమిస్తుందని హీరోహీరోయిన్లకు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి జరపడంతో మొదలైన ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే ‘ఓరి దేవుడా’ సినిమా.

పెళ్లి చేసుకున్న హీరో లైఫ్ లోకి, అతడి చైల్డ్ హుడ్ క్రష్ ఎంటర్ అవ్వడంతో.. హీరోహీరోయిన్ల మధ్య గొడవ స్టార్ట్ అవ్వడం. ఇంతలో అతడికి యాక్సిడెంట్ అవ్వడం. అతడి తప్పు సరిదిద్దుకోవడానికి దేవుడు(హీరో వెంకటేష్) మరో ఛాన్స్ ఇచ్చి కిందకి పంపించడం. ఈ నేపథ్యంలో విశ్వక్, వెంకటేష్ కి అతడి కథని చెప్పే తీరుని చాలా కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు.

ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతుండగా, పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.