మోడీ సినిమాకు లైన్ క్లియర్...11నే విడుదల

మోడీ సినిమాకు లైన్ క్లియర్…11నే విడుదల

మోడీ సినిమాకు లైన్ క్లియర్…11నే విడుదల

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన సినిమా “పీఎం నరేంద్రమోడీ”కి లైన్ క్లియర్ అయింది.ఏప్రిల్-11,2019న ఈ సినిమా విడుదలవుతుందని శుక్రవారం(ఏప్రిల్-5,2019) డైరక్టర్ ఒమంగ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.అయితే అదే రోజు మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుండటం విశేషం.పోలింగ్ రోజునే మోడీ బయోపిక్ రిలీజ్ కానుంది.

 ముందుగా సినిమా ను ఈ నెల 5న విడుదల చెయ్యాలని భావించారు.అయితే సెన్సార్ బోర్డు ఎగ్జామినేషన్,సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానందున సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు గురువారం ఈ సినిమా బృందం సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.

సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయని ఏప్రిల్-11న సినిమా విడుదల కానుందని డైరక్టర్ ఒమంగ్ కుమార్ శుక్రవారం తెలిపారు.అంతేకాకుండా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ణతలు తెలిపారు.
ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన మోడీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలంటూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ ను కోరిన విషయం తెలిసిందే.ఎన్నికల్లో లబ్ది కోసమే మోడీ బయోపిక్ ను పోలింగ్ సమయంలో విడుదల చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

×