Pokiri Re-Release: పోకిరి రీ-రిలీజ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. మహేషా మజాకా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘పోకిరి’ అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల పోకిరి 4K మాస్టర్ వర్షన్‌ను రీ-రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీరిలీజ్ అయిన పోకిరి సినిమా, ఏకంగా రూ.1.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అదరగొట్టింది.

Pokiri Re-Release: పోకిరి రీ-రిలీజ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. మహేషా మజాకా!

Pokiri Re-Release Worldwide Collections

Updated On : August 12, 2022 / 5:39 PM IST

Pokiri Re-Release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘పోకిరి’ అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ, ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా, అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల పోకిరి 4K మాస్టర్ వర్షన్‌ను రీ-రిలీజ్ చేశారు.

Mahesh Babu Pokiri Re-Release : పోకిరి వరల్డ్ వైడ్ రీ రిలీజ్.. 16 ఏళ్ళైనా తగ్గని క్రేజ్.. టికెట్లు మొత్తం సేల్..

అయితే ఓ సినిమా రీరిలీజ్ అంటే ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపరు. కానీ, మహేష్ బాబు పోకిరి సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులే కాకుండా ఇతర ఆడియెన్స్ కూడా ఆసక్తిని కనబరిచారు. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్ అయిన అన్ని చోట్లా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీరిలీజ్ అయిన పోకిరి సినిమా, ఏకంగా రూ.1.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అదరగొట్టింది.

Pokiri Special Shows: పోకిరి స్పెషల్ షో.. క్రేజ్ కా బాప్!

ఇలా ఓ సినిమా రీరిలీజ్‌లో కూడా ఈ తరహా కలెక్షన్లు రాబట్టడం నిజంగా విశేషమే. మహేష్ బాబుకు ఏ తరహా క్రేజ్ ఉందో ఈ కలెక్షన్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మహేష్ పోకిరి రీ-రిలీజ్ ఈ స్థాయిలో సక్సెస్ కావడంతో, మిగతా హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరో కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను కూడా రీ-రిలీజ్ చేయాలని కోరుతున్నారు.