Pokiri Special Shows: పోకిరి స్పెషల్ షో.. క్రేజ్ కా బాప్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ అప్పట్లోనే కల్ట్ క్లాసిక్ మూవీగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా పోకిరి చిత్రాన్ని రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pokiri Special Shows: పోకిరి స్పెషల్ షో.. క్రేజ్ కా బాప్!
ad

Pokiri Special Shows: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ అప్పట్లోనే కల్ట్ క్లాసిక్ మూవీగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మాస్‌లో ఒక్కసారిగా పండుగాడు పాతుకుపోయాడు. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఈ చిత్రానికి ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా క్రేజ్ ఏమిటో ప్రూవ్ అయ్యింది.

Mahesh Babu Pokiri Re-Release : పోకిరి వరల్డ్ వైడ్ రీ రిలీజ్.. 16 ఏళ్ళైనా తగ్గని క్రేజ్.. టికెట్లు మొత్తం సేల్..

తాజాగా పోకిరి చిత్రాన్ని రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నైజాం ప్రాంతంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ఈ చిత్ర షోల సంఖ్య చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే నైజాం ప్రాంతంలో ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఏకంగా 54 షోలు కన్ఫర్మ్ అయ్యాయి. ఇక మరికొన్ని షోలు కూడా ఈ సినిమా రీ-రిలీజ్‌కు జోడించేందుకు రెడీ అవుతున్నారు.

15 Years Pokiri: ఎవడు కొడితే మైండ్ బ్లాకవుతుందో.. ఆ పండుగాడికి 15 ఏళ్ళు!

ఇక ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన తీరు మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఒక సినిమా రీరిలీజ్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం కేవలం మహేష్ క్రేజ్‌కి నిదర్శనం అని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ మరో మేజర్ అసెట్ కాగా, ప్రకాశ్ రాజ్, నాజర్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి పోకిరి రీరిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.