15 Years Pokiri: ఎవడు కొడితే మైండ్ బ్లాకవుతుందో.. ఆ పండుగాడికి 15 ఏళ్ళు!

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు.. ఆడ్ని నేనే. నేనెవడి కోసం పనిచేయను.. పనేంటి.. నీకేంటి.. నాకేంటి?. ఈ తొక్కలో మీటింగులేంటో అర్ధం కావడం లేదు. పదిమందున్నారు ఏసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు. ఈ డైలాగ్స్ కి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ దద్దరిల్లిన సంగతి తెలిసిందే.

15 Years Pokiri: ఎవడు కొడితే మైండ్ బ్లాకవుతుందో.. ఆ పండుగాడికి 15 ఏళ్ళు!

15 Years Pokiri

15 Years Pokiri: ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు.. ఆడ్ని నేనే. నేనెవడి కోసం పనిచేయను.. పనేంటి.. నీకేంటి.. నాకేంటి?. ఈ తొక్కలో మీటింగులేంటో అర్ధం కావడం లేదు. పదిమందున్నారు ఏసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు. ఈ డైలాగ్స్ కి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ దద్దరిల్లిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘పోకిరి’ సినిమాకి నేటితో ఒకటిన్నర దశాబ్దం. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది.

కొన్ని కొన్ని సినిమాలు ఏకంగా సినిమా ట్రెండ్ మార్చేస్తాయని చెప్తారు. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ శివ. ఆ సినిమాకి ముందు.. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీ అని వేరు చేసి చూస్తారు. దాదాపుగా పోకిరి కూడా అంతే. భారీ భారీ డైలాగ్స్ కాదు సుత్తిలేని డైలాగ్స్ కావాలని పోకిరితో నిరూపించారు. పూరి జగన్నాధ్ మాటలు, టేకింగ్ కి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఫలితంగా పోకిరి సినిమా అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది.

ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్, మాటలు, మేనరిజం, సినిమా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్, ముమైత్ స్పెషల్ సాంగ్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్, ఇలియానా అందం, మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్, బ్రహ్మి కామెడీ ఇలా అన్నీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని మిగిల్చాయి. ఈ సినిమా కోసం మహేష్ కానీ.. దర్శకుడు పూరి జగన్నాధ్ కానీ ప్లాన్ చేసి కష్టపడిందేం లేదట. ఏదో సింపుల్ గా చేసుకుంటూ పోయారు. ఈ విషయాన్ని పూరి జగన్నాధ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే సినిమా విడుదలై రోజులు గుడుస్తుంటే కానీ సినిమా స్టామినా ఏంటో తెలియలేదు.

పోకిరి అప్పట్లో 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసిందంటే పండుగాడు చేసిన రచ్చ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా అటు మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేయడమే కాకుండా లాభాలను కూడా భారీగానే తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ బ్యానర్‌తో పాటు మంజుల తన ఇందిరా ప్రొడక్షన్స్‌లో సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ అయేషా టకియాను అనుకోగా చివరికి ఇలియానాకు అవకాశం దక్కింది. ఫలితంగా ఇలియానా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపొయింది.