Salaar: సాలార్ మూవీలో ప్రభాస్ లుక్స్ సూపర్..

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకులకు దూరంగా ఉన్నపటికీ, అతని అభిమానులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ప్రభాస్ స్టైలిష్ హిట్ మూవీ "బిల్లా" రీ రిలీజ్ చేసి థియేటర్ల వద్ద రెబల్ జాతర నిర్వహిస్తున్నారు. ఇక సాలార్ చిత్రం నుంచి...

Salaar: సాలార్ మూవీలో ప్రభాస్ లుక్స్ సూపర్..

Salaar: టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకులకు దూరంగా ఉన్నపటికీ, అతని అభిమానులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ప్రభాస్ స్టైలిష్ హిట్ మూవీ “బిల్లా” రీ రిలీజ్ చేసి థియేటర్ల వద్ద రెబల్ జాతర నిర్వహిస్తున్నారు. ఈమధ్య కాలంలో వింటేజ్ ప్రభాస్ ని మిస్ అయిన అభిమానులు, మళ్ళీ వెండితెరపై బిల్లా సినిమాలో చూసి సందడి చేస్తున్నారు.

Prabhas: ప్రాజెక్ట్-K సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడా?

ఇక ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాల నుంచి కూడా వరుస అప్డేట్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్-K నుంచి కొత్త పోస్టర్ లు విడుదల కాగా.. సాలార్ చిత్రం నుంచి డార్లింగ్ వర్కింగ్ స్టిల్స్ ని విడుదల చేశారు మూవీ టీం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా అవ్వడంతో.. డార్లింగ్ అభిమానులు ప్రభాస్ లుక్స్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఆ వైరల్ అయిన ఫోటోలు వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Image

Image

Image