Priyanka Chopra : రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని మిస్ వరల్డ్ చేశారు.. మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు..

ఈ వివాదంపై మాట్లాడుతూ మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు అని వ్యాఖ్యలు చేసింది. దీంతో లీలాని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.............

Priyanka Chopra : రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని మిస్ వరల్డ్ చేశారు.. మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు..

priyanka chopra miss world 2000 was rigged says by ex miss barbados Leilani Mcconny

Updated On : November 4, 2022 / 11:27 AM IST

Priyanka Chopra :  ఇటీవల మిస్ USA 2022 పోటీలు జరిగాయి. అయితే ఇందులో రాబోన్ గాబ్రియేల్ గెలిచింది. అయితే ఈ పోటీలో రిగ్గింగ్ జరిగిందని, కావాలని గాబ్రియేల్ ని గెలిపించారని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో చేసింది. మిస్ USA 2022 పోటీలలో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్ ని గెలిపించారని వ్యాఖ్యలు చేసింది.

అయితే ఈ వివాదంపై మాట్లాడుతూ మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు అని వ్యాఖ్యలు చేసింది. దీంతో లీలాని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వీడియోలో మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ మాట్లాడుతూ.. ”మిస్ వరల్డ్ 1999 లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 లో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది. 2000 సంవత్సరంలో నేను కూడా పోటీలకు అప్లై చేశాను. అప్పుడు నేను మిస్ బార్బడోస్ గా ఉన్నాను.”

”ఆ సమయంలో చీటింగ్ చేశారు. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే ఇండియాకి చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్ లో అందరూ బికినీలు వేసుకున్నారు, కానీ ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానమొచ్చింది. ప్రియాంకని ప్రత్యేకంగా చూసేవారు.”

Nandu : నా మూడు సంవత్సరాల సంపాదన ఈ సినిమా మీద పెట్టా.. రష్మీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

”అలాగే అప్పుడు అందరికి గౌన్స్ డిజైన్ చేసింది జాసన్ వు. మా అందరికి ఒకే రకమైన గౌన్స్ డిజైన్ చేశాడు. కానీ ప్రియాంకకి మాత్రం స్పెషల్ గా డిజైన్ చేశాడు. ఇక 1999లో యుక్తాముఖి మిస్ ఇండియా అదే సంవత్సరం మిస్ వరల్డ్ గెలుచుకుంది. 2000 లో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్, మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు” అని వ్యాఖ్యానించింది. దీంతో రిగ్గింగ్ జరిగి ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ అయిందనడంతో ఈ వ్యాఖ్యలు ఇండియాలో, బయట కూడా వైరల్ గా మారాయి.