U. Visweswara Rao : నిర్మాత,దర్శకుడు. యు.విశ్వేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు చెన్నై లో కరోనా సోకి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు ఆయన వియ్యంకుడు అవుతారు.  విశ్వశాంతి విశ్వేశ్వరరావుగా పేరోందిన ఆయన పలు విజయవంతమైన  చిత్రాలు నిర్మించారు.

U. Visweswara Rao : నిర్మాత,దర్శకుడు. యు.విశ్వేశ్వరరావు కన్నుమూత

U.visweswara Rao

U. Visweswara Rao : ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు(92) చెన్నై లో కరోనా సోకి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు ఆయన వియ్యంకుడు అవుతారు.  విశ్వశాంతి విశ్వేశ్వరరావుగా పేరోందిన ఆయన పలు విజయవంతమైన  చిత్రాలు నిర్మించారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన విశ్వేశ్వరరావు బీఎస్సీ వరకు చదువుకుని గుడివాడలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు.

తొలి రోజుల్లో ఆయన రంగస్థల నటుడు, నాటక రచయిత. విశ్వేశ్వరరావు మంచి గేయ రచయిత, కధకుడు కూడా. అతని బావ దావులూరి రామచంద్రరావు ప్రోద్భలంతో సినీరంగంలోకి ప్రవేశించిన విశ్వేశ్వరరావు తొలుత పి.పుల్లయ్యవద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరారు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద సహయ దర్శకుడిగా పనిచేశారు.  ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు. ఆ చిత్రం విడుదలై నిర్నాతగా ఆయనకు  లాభాలు తెచ్చి పెట్టింది.

ఆ ప్రోత్సాహంతో ఆయన విశ్వశాంతి అనే పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు.  తమిళ, తెలుగు  భాషలలో 15 డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నారు.

వాణిజ్యపరంగా విజయవంతమైన  చిత్రాలు తీసినా,  తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రారని తనే దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఆయనే కథను సమకూర్చుకునే వారు. కంచుకోట, తీర్పు, పెత్తందార్లు, మార్పు, నగ్నసత్యం, హరిశ్చంద్రుడు వంటి  25 సినిమాలు నిర్మిoచారు.

‘దేశోద్థారకులు’ చిత్రంలో ‘ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు’ అనే పాటను ఆయనే రాశారు. ‘నగ్నసత్యం’, హరిశ్చందుడ్రు’ చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకోగా, ‘కీర్తి కాంతా కనకం’, ‘పెళ్లిళ్ల చదరంగం’ చిత్రాలకు గానూ రెండు నందులను సొంతం చేసుకున్నారు.

17వ నేషనల్‌ అవార్డ్‌ సెంట్రల్‌ జ్యూరీ మెంబర్‌గా ఉండడమే కాకుండా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శిగా కూడా విశ్వేశ్వర రావు పనిచేశారు. విశ్వేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.