Pushpa : నార్త్‌లోను ‘పుష్ప’దే హవా.. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా..

ప్రముఖ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసింది. తెలుగు అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో అల్లు అర్జున్ 'పుష్ప 2' మొదటి స్థానం దక్కించుకుంది. అంతేకాదు నార్త్‌లోను...

Pushpa : నార్త్‌లోను ‘పుష్ప’దే హవా.. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా..

Pushpa : ప్రముఖ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసింది. దేశంలో ఎక్కువమంది ఎవర్ని ఇష్టపడుతున్నారు, ఎవరకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఏ సినిమా కోసం అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు అనే అంశాలుపై ప్రతి సంవత్సరం ఒక సర్వే నిర్వహిస్తుంటుంది ఆర్మాక్స్ మీడియా.

Pushpa 2: పుష్పరాజ్‌ను ఢీకొనేందుకు రెడీ అవుతున్న లేడీ విలన్.. టాపులేచిపోద్ది!

తాజాగా తెలుగు అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తరువాత ప్రభాస్ సలార్, ఆదిపురుష్. మెగా బ్రదర్స్ పవన్ – హరిహర వీరమల్లు, చిరంజీవి – వాల్తేరు వీరయ్య ఉన్నాయి. ఈ సినిమాల ట్రైలర్ లు విడుదల కాకపోయినా, అభిమానుల్లో మంచి బుజ్ ని క్రియేట్ చేసుకున్నాయి.

కాగా ‘పుష్ప 2’ సినిమా హిందీ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ లో కూడా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టే అర్ధమవుతుంది పుష్ప మేనియా నార్త్ లో ఏ రేంజ్ లో ఉందని. ఇక షారుఖ్ – పఠాన్, సల్మాన్ – టైగర్ 3, ప్రభాస్ – సలార్, షారుఖ్ – జవాన్ తరువాతి వరుసలో నిలిచాయి. మరి ఇంతటి బజ్ ని క్రియేట్ చేసుకుంటున్న ‘పుష్ప ది రూల్’ ఎంతటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.