Pushpa 2: పుష్పరాజ్‌ను ఢీకొనేందుకు రెడీ అవుతున్న లేడీ విలన్.. టాపులేచిపోద్ది!

ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పుష్ప పార్ట్-2లో ఓ లేడీ విలన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. ఈ పాత్రలో నటించేందుకు ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేయాలని సుకుమార్ చూస్తున్నాడట.

Pushpa 2: పుష్పరాజ్‌ను ఢీకొనేందుకు రెడీ అవుతున్న లేడీ విలన్.. టాపులేచిపోద్ది!

Catherine Tresa To Play Lady Villain In Pushpa 2

Pushpa 2: ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమాకు వారు బ్రహ్మరథం పట్టడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించిన సుకుమార్ అండ్ టీమ్, ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

Pushpa 2: సుకుమార్ ఆలోచనలు అర్థం కావడం లేదంటోన్న ఫ్యాన్స్..!

ఇక ఈ సీక్వెల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది. పుష్ప పార్ట్-2లో ఓ లేడీ విలన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. ఈ పాత్రలో నటించేందుకు ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేయాలని సుకుమార్ చూస్తున్నాడట. అయితే బన్నీతో ఇప్పటికే నటించిన హీరోయిన్ అయితే ఈ పాత్రను కంఫర్ట్‌గా చేయగలుగుతుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఈ లేడీ విలన్ పాత్రలో అందాల భామ కేథరిన్ త్రేజాను సెలెక్ట్ చేసేందుకు పుష్ప టీమ్ ప్లాన్ చేస్తోందట.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన..

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, ఈ సినిమాలో కేథరిన్ నటిస్తే బన్నీతో ఆమె స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్లలో టాపులేచిపోద్ది అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో వీరిద్దరు కలిసి నటించగా, ఆ సినిమాలోని పాటల్లో వీరిద్దరి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీని అభిమానులు ఎంజాయ్ చేశారు. మరి ఇప్పుడు పుష్ప-2లో మరోసారి ఈ కాంబినేషన్ ను వెండితెరపై చూస్తామా లేదా అనేది చిత్ర యూనిట్ కన్ఫం చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.