Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప-ది రైజ్’. ఒక తెలుగు సినిమాగా వచ్చి మొత్తం దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, తగ్గేదెలా అనే మ్యానరిజంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తున్నా పుష్ప-ది రూల్ షూటింగ్ ఇంకా పట్టాలు ఎక్కలేదు. వెంటనే పుష్ప 2 అప్డేట్స్ ఇవ్వాలంటూ గీతా ఆర్ట్స్ ముందు...

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన..

Allu Arjun Fans Protesting Before Geetha Arts For Pushpa 2 Update

Pushpa 2 : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప-ది రైజ్’. ఒక తెలుగు సినిమాగా వచ్చి మొత్తం దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, తగ్గేదెలా అనే మ్యానరిజంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా, సెకండ్ పార్ట్ ‘పుష్ప-ది రూల్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Pushpa: ‘ఆర్ఆర్ఆర్’ బాటలోనే పుష్ప పయనం.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తున్నా పుష్ప-ది రూల్ షూటింగ్ ఇంకా పట్టాలు ఎక్కలేదు. మొదటి భాగం అఖండమైన విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు సెకండ్ పార్ట్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాతలు కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా, ఎంత బడ్జెట్ అయినా కూడా ఓకే అంటు లెక్కల మాస్టర్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారట.

అయితే సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేడు పుష్ప 2 అప్డేట్స్ వెంటనే ఇవ్వాలంటూ గీతా ఆర్ట్స్ ముందు ఆందళోనకు దిగారు. పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు, ఇంకా లేట్ చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ అల్టిమేటమ్ జారీ చేసారు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.