Peddanna: సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అడుగేస్తే ఇండస్ట్రీ రికార్డులు, స్టెప్పేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైన రోజులెన్నో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.

10TV Telugu News

Peddanna: సూపర్ స్టార్ రజనీ కాంత్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అడుగేస్తే ఇండస్ట్రీ రికార్డులు, స్టెప్పేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైన రోజులెన్నో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కంటి చూపుతో ఇండియన్ సినిమాని శాసించిన రోజులూ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే.. కొన్నాళ్లగా రజనీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆయనకి వయసు మీదపడినా కెమెరా ముందు జోరు మాత్రం తగ్గలేదని ప్రతి సినిమాలో కనిపించినా సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు.

Bhumi Pednekar: అందాలతో భూమి రచ్చ.. మతులు పోగొడుతుందిగా!

ఈమధ్య సినిమాల స్పీడ్ ని తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా అన్నాత్తైతో లేటెస్ట్ గా వచ్చాడు. భారీ స్టార్ కాస్ట్ తో శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా దీపావళికి వచ్చేసేంది. తెలుగులో ఈ సినిమా భారీ డిజాస్టర్ మూటగట్టుకోగా తమిళంలో మాత్రం రజని మేనియాతో వసూళ్ల పరంగా బయటపడింది. ఇప్పటికీ అక్కడ ఈ సినిమాకి వసూళ్లు స్టడీగానే ఉన్నాయని రజనీ అభిమానులు సోషల్ మీడియాలో ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు.

Drushyam 2 Telugu: అమెజాన్‌లో వచ్చేసిన వెంకీ మరో దృశ్యం!

అయితే, వసూళ్లు స్టడీగానే ఉన్నాయని చెప్తున్నా.. ఈ సినిమా అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేకుండా సడెన్ గా డిజిటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నిన్న (బుధవారం) రాత్రి నుంచే ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీతో పాటు అన్ని ఇతర భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసి ఆశ్చర్యపరిచింది. సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకున్నా రజనీ కోసం చూడాలనుకునే వారు ఓటీటీలో చూసేయొచ్చు.