Ram Charan : నాకు సైనస్ ప్రాబ్లమ్, డస్ట్ ఎలర్జీ ఉంది.. కానీ RRRలో నా ఎంట్రీ సీన్ 30 రోజులు డస్ట్ లోనే తీశారు..

చరణ్ మాట్లాడుతూ.. ''RRR సినిమాలో నా ఎంట్రీ సీన్ తీయడానికి దాదాపు 30 రోజులు పట్టింది. నాకు అసలే సైనస్ ప్రాబ్లమ్, డస్ట్ ఎలర్జీ ఉంది. కానీ RRRలో నా ఎంట్రీ సీన్ 30 రోజులు డస్ట్ లోనే.........

Ram Charan : నాకు సైనస్ ప్రాబ్లమ్, డస్ట్ ఎలర్జీ ఉంది.. కానీ RRRలో నా ఎంట్రీ సీన్ 30 రోజులు డస్ట్ లోనే తీశారు..

Ram Charan about his entry scene in RRR Movie

Ram Charan :  ఇటీవల RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. నార్త్ లో కూడా చరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొన్నటివరకు RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసి ఇటీవలే ఇండియాకి వచ్చాడు చరణ్. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వచ్చాడు. రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు, హిందీ పాటలకి డ్యాన్సులు వేసి అదరగొట్టారు.

సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ని RRR సినిమాలోని తన ఇంట్రో సీన్ గురించి అడిగారు. RRR సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో సీన్ అద్భుతంగా అంటుందని అందరికి తెలిసిందే. వేల మంది జనం మధ్యలో చరణ్ ఒక పోలీసాఫీసర్ లా ఎంట్రీ ఇవ్వడం, ఆ సీన్ చూడటానికి కూడా ఒళ్ళు గగుర్పుడిచేలా ఉంటుంది. ఈ ఎంట్రీ సీన్ గురించి చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

Ram Charan : RC 15 గురించి శంకర్ సర్‌ని అడగండి.. నాకు కూడా ఏమి తెలీదు.. త్వరలో న్యూజిలాండ్‌కి సాంగ్ షూట్‌కి వెళ్తున్నాము..

చరణ్ మాట్లాడుతూ.. ”RRR సినిమాలో నా ఎంట్రీ సీన్ తీయడానికి దాదాపు 30 రోజులు పట్టింది. నాకు అసలే సైనస్ ప్రాబ్లమ్, డస్ట్ ఎలర్జీ ఉంది. కానీ RRRలో నా ఎంట్రీ సీన్ 30 రోజులు డస్ట్ లోనే తీయాల్సి వచ్చింది. 3000 మంది జనాల మధ్యలో నన్ను వదిలేశారు. డైరెక్టర్ అసలు నాకు కనపడేవాడు కాదు. ఎక్కడో దూరంగా ఉండేవాడు ఓ వైట్ క్లాత్ తో సిగ్నల్స్ ఇచ్చేవారు. అంతమందిలో, ఆ డస్ట్ లో నా ఎంట్రీ సీన్ తీయడానికి చాలా కష్టపడ్డారు. నాకు దానివల్ల చాల ఎఫెక్ట్ అయింది. కానీ స్క్రీన్ మీద ఆ సీన్ చూశాక, ఆ సీన్ కి జనాల స్పందన చూశాక ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందనిపించింది” అని తెలిపారు. దీంతో చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.