RGV : నల్లమల అడవుల్లో గన్స్ పట్టుకొని వైల్డ్ యానిమల్‌లా తిరిగేస్తున్న ఆర్జీవీ..

ఆర్జీవీ ప్రస్తుతం నల్లమల అడవుల్లో సంచరిస్తున్నారు. తన వెనకాల కొంతమంది గన్ మెన్స్ ని పెట్టుకొని తాను కూడా ఓ గన్ పట్టుకొని అడవుల్లో తిరుగుతున్నాడు.

RGV : నల్లమల అడవుల్లో గన్స్ పట్టుకొని వైల్డ్ యానిమల్‌లా తిరిగేస్తున్న ఆర్జీవీ..

Ram Gopal Varma posting photos and videos with Guns from Nallamala Forest

Updated On : September 3, 2023 / 9:35 AM IST

RGV Tweets : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో మంచి సినిమాలు తీసేసి ఇప్పుడు తన ఇష్టం అంటూ తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటున్నాడు. త్వరలో వైఎస్ జగన్ బయోపిక్ అంటూ వ్యూహం(Vyooham) సినిమాతో రాబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్జీవీ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆర్జీవీ ప్రస్తుతం నల్లమల అడవుల్లో సంచరిస్తున్నారు. తన వెనకాల కొంతమంది గన్ మెన్స్ ని పెట్టుకొని తాను కూడా ఓ గన్ పట్టుకొని అడవుల్లో తిరుగుతున్నాడు. అడవుల్లో ప్రత్యేకంగా తిరిగే జీపులో తిరుగుతూ అక్కడక్కడా దిగి నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాడు. నల్లమల అడవుల్లో గన్ పట్టుకొని తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను వైల్డ్ యానిమల్ అని పోస్టులు పెడుతున్నాడు.

Ram Gopal Varma posting photos and videos with Guns from Nallamala Forest

క్సెస్ పార్టీ.. సల్మాన్, షారుఖ్‌తో సహా తరలి వచ్చిన బాలీవుడ్..

అయితే ఆర్జీవీ నల్లమల అడవులకు వెళ్ళింది వ్యూహం సినిమా కోసమే అని, వ్యూహం సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ నల్లమల అడవుల్లో షూట్ చేస్తారని, అందుకే ఆర్జీవీ నల్లమల అడవుల సందర్శనకు, షూట్ ప్లేస్ లు వెతుక్కోవడానికి వెళ్లాడని సమాచారం. తనతో పాటు మరికొంతమందిని కూడా తీసుకెళ్లాడు ఆర్జీవీ. వారితో కలిసి దిగిన ఫొటోలు కూడా షేర్ చేస్తున్నాడు. రైన్ ఫారెస్ట్ ఛాలెంజ్ లో ఛాంపియన్ షిప్ అయిన చేతన్ ని కూడా తనతో తీసుకెళ్లాడు ఆర్జీవీ. కొంతమంది మాత్రం ఆర్జీవీ నల్లమల ఫారెస్ట్ కి వెకేషన్ కి వెళ్ళాడు అని అంటున్నారు. దేనికైతే ఏముంది మరోసారి ఆర్జీవీ తన పోస్టులతో వైరల్ అవుతున్నారు.