Ram Setu: అక్షయ్ కుమార్ “రామసేతు” టీజర్ అదరహో..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ హీరో సత్యదేవ్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ "రామసేతు". హిందూ పురాణాల్లో శ్రీరాముడు కట్టిన వారధి అని చెప్పబడే రామసేతు చుట్టూ ఈ సినిమా కథాంశం తిరగనుంది. ఇక సినిమా టీజర్ ను చిత్ర యూనిట్..

Ram Setu: అక్షయ్ కుమార్ “రామసేతు” టీజర్ అదరహో..

Ram Setu Teaser Released

Ram Setu: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ హీరో సత్యదేవ్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ “రామసేతు”. హిందూ పురాణాల్లో శ్రీరాముడు కట్టిన వారధి అని చెప్పబడే రామసేతు చుట్టూ ఈ సినిమా కథాంశం తిరగనుంది.

Brahmastra: బ్రహ్మాస్త్ర బంపర్ ఆఫర్.. కేవలం నాలుగే రోజులట!

ఇక సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ ‘ఫస్ట్ గ్లింప్స్ అఫ్ ది వరల్డ్ ఆఫ్ రామ్ సేతు’ అంటూ విడుదల చేసింది. “రామసేతుని కాపాడుకోడానికి ఇంకా మనకి మూడు రోజులే ఉన్నాయంటూ” మొదలైన టీజర్ చివరివరకు చాలా ఇంట్రస్టింగా సాగింది. భారతదేశ వారసత్వాన్ని నాశనం చేయడానికి ముందే పురాణ రామసేతు యొక్క నిజమైన ఉనికిని నిరూపించడానికి ఫైట్ చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నాడు.

భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదల కాబోతున్నట్లు ఈ టీజర్ తో ప్రకటించారు మూవీ మేకర్స్.ఈ మధ్య భారతదేశ పురాణాల ఆధారంగా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.