Rangaranga Vaibhavanga Censor: రంగరంగ వైభవంగా సెన్సార్ రిపోర్ట్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ!

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది.

Rangaranga Vaibhavanga Censor: రంగరంగ వైభవంగా సెన్సార్ రిపోర్ట్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ!

Rangaranga Vaibhavanga Censor Report

Rangaranga Vaibhavanga Censor: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్ర ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది.

RangaRanga Vaibhavanga Trailer: రంగరంగ వైభవంగా ట్రైలర్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ అంటోన్న ఫ్యాన్స్!

కాగా, ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, రొమాంటిక్ అంశాలను కూడా కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించినట్లుగా తెలుస్తోంది.

RangaRanga Vaibhavanga : రిషి, రాధల ప్రేమకథ ‘రంగరంగ వైభవంగా’ ఉంటుంది..

ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్-కేతిక శర్మల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.