Rashmika Mandanna : రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

రష్మిక ఆస్తులకు సంబందించిన న్యూస్ గత కొద్దీ రోజులుగా వైరల్ అవుతుంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అనదికాలంలోనే కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. లగ్జరీ కారు, ముంబైలో ఓ భవనం కొనుగోలు చేసినట్లుగా సమాచారం. కాగా ప్రస్తుతం ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Rashmika Mandanna : రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

Rashmika Mandanna

Rashmika Mandanna : అందం, అభినయం కలిసిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. ఆమె అందాన్ని చూసి కుర్రకారు సైతం అబ్బబ్బా.. అమ్మాయెంత ముద్దుగున్నాదే… అంటూ సిగ్గుపడిపోతారు. తెలుగు, తమిళం, హిందీ. కన్నడ భాషల్లో నటిస్తూ అంతటా అభిమానులని సంపాదించింది ఈ అమ్మడు. ఇక తాజాగా రష్మిక ఆస్తుల వ్యవహారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రష్మిక బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు గుడ్ బై అని టైటిల్ ఫిక్స్ చేశారు.

I like surprising myself with different roles: Rashmika Mandanna

ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు.. కానీ హిందీలో రష్మికకు బోలెడు ఆఫర్లు వచ్చిపడ్డాయి. బాలీవుడ్ నిర్మాతలు ఆమెకు భారీ పారితోషకం ఇచ్చేందుకు కూడా సై అంటున్నట్లు సమాచారం. 4 నుంచి 5 కోట్లు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదని టాక్. ఇక వాణిజ్య ప్రకటనల నుంచి కూడా రష్మిక బాగానే వెనకేసుకుంటుంది. ఒక్క ప్రకటనలో కనిపిస్తే 15 నుంచి 25 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న ఈవెంట్స్, ఓపెనింగ్స్ కి వెళ్ళినప్పుడు 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారట..

Feel bad I didn't get to meet you: Rashmika Mandanna on recent incident involving a fan | Deccan Herald

ఇక రెండుచేతులా సంపాదిస్తున్న రష్మిక ఆస్తి రూ. 35 నుంచి 40 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ముంబైలో ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు రష్మిక. అందుకు సంబందించిన ఫోటోలు తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Rashmika Mandanna To Go De-Glam For Acharya?