Vijayawada Police: న్యూఇయర్ వేళ విజయవాడలో కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఇక అంతే

ఈ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయరే కాకుండా సేఫ్ న్యూఇయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అని విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.

Vijayawada Police: న్యూఇయర్ వేళ విజయవాడలో కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఇక అంతే

DCP Shereen Begum (Image Credit To Original Source)

Updated On : December 31, 2025 / 8:49 PM IST
  • న్యూఇయర్ వేడుకలపై విజయవాడ పోలీసుల నజర్
  • రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు
  • నిబంధనలు ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్

 

Vijayawada Police: న్యూఇయర్ వేళ విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. యువత అదుపు తప్పి ప్రవర్తించకుండా డ్రంకన్ డ్రైవన్ తనిఖీలు నిర్వహించబోతున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విజయవాడ వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. అల్లర్లకు పాల్పడే వారి తాట తీస్తామని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం హెచ్చరించారు. న్యూఇయర్ సందర్భంగా రాత్రి ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా, డ్రంకన్ డ్రైవింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు.

రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తాం- షరీన్ బేగం, విజయవాడ ట్రాఫిక్ డీసీపీ..

”న్యూ ఇయర్ వేడుకలను హ్యాపీగా జరుపుతోంది. ఎంజాయ్ చేయండి. కానీ, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. రూల్స్ బ్రేక్ చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే నగర సీపీ ఆదేశాల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి చాలా కఠిన ఎన్ ఫోర్స్ మెంట్ జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతాం. గట్టి బందోబస్తు ప్లాన్ చేశాం. ముఖ్యంగా ఈ న్యూఇయర్ హ్యాపీ న్యూఇయరే కాకుండా సేఫ్ న్యూఇయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం.

రాత్రికి ఫ్లై ఓవర్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నాం. ఫ్లై ఓవర్లపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వెళ్లి వేడుకలు చేసుకున్నాక అదే మూడ్ లో ఓవర్ స్పీడ్ గా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్లైఓవర్లను మూసి వేస్తాం. ప్రధాన రహదారులు ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్ పై ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ గట్టిగా జరుగుతుంది.

మందుబాబుల సేఫ్టీ బాధ్యత వారిదే..

వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల వాళ్లకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాము. లిక్కర్ ఎక్కువగా తాగేసిన వారు వాహనాలు నడపకుండా వారిని ప్రైవేట్ వెహికల్ లో పంపేలా చూడాలి. లేదంటే ఒక డ్రైవర్ ని నియమించాలి. లిక్కర్ తీసుకున్న వారిని సేఫ్ గా వారి ఇళ్లకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని వైన్ షాపులు, రెస్టారెంట్ల వాళ్లకు నోటీసులు ఇచ్చాము” అని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం అన్నారు.

Also Read: న్యూఇయర్ వేడుకల వేళ విశాఖలో కలకలం.. పోలీసులు హైఅలర్ట్