Rashmika : అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి పిచ్చెక్కుతుంది.. ఈ రేంజ్ లో రష్మిక ఎప్పుడూ నవ్వి ఉండదు..

రష్మిక మాట్లాడుతూ.. నాలుగైదు భాషల సినిమాల్లో నటించేసరికి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంటే పిచ్చెక్కుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ వచ్చు. రోజు షూటింగ్స్ అయ్యాక ఒక గంట క్లాస్...........

Rashmika : అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి పిచ్చెక్కుతుంది.. ఈ రేంజ్ లో రష్మిక ఎప్పుడూ నవ్వి ఉండదు..

Rashmika Mandanna : ఇటీవల సినిమాల ప్రమోషన్స్ ని రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్ని వీలయితే అన్ని ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఫ్యాన్స్, యూట్యూబర్స్ తో చిట్ చాట్స్.. ఇలా రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు స్పెషల్ ఇంటర్వ్యూలు కొన్ని చేసి రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూలు అన్ని యాంకర్ సుమనే చేస్తుంది. సుమకి డేట్స్ ఖాళీ లేని సమయంలో తప్పదు అనుకుంటే వేరే వాళ్ళతో చేయిస్తారు చిత్ర యూనిట్స్. కానీ ఇటీవల సుమకి కాంపిటేషన్ గా బిత్తిరి సత్తి వచ్చాడు. సుమ డేట్స్ లేకపోయినా, ఉన్నా బిత్తిరి సత్తితోటి కచ్చితంగా ఓ ఇంటర్వ్యూని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్స్. సర్కారు వారి పాట, పక్కా కమర్షియల్, RRR, F3, అంటే సుందరానికి, ది వారియర్, జయమ్మ పంచాయితీ.. ఇలా స్టార్ హీరోల అన్ని సినిమాలకి హీరోలని, చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేశాడు బిత్తిరి సత్తి. ఈ ఇంటర్వ్యూలు అన్ని బాగా పాపులర్ అవ్వడంతో మిగిలిన హీరోలు, సినిమా వాళ్ళు కూడా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ ప్లాన్ చేయిస్తున్నారు.

తన నవ్వు తెప్పించే మాట విధానం, యాక్సెంట్, కామెడీ పంచులు అందరికి తెగ నచ్చేస్తున్నాయి. బిత్తిరి సత్తి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లంతా అతని మాట విధానానికి పడి పడి నవ్వుతున్నారు. దీంతో తమ హీరోలు ఇంతలా ఎప్పుడూ నవ్వలేదని ఫ్యాన్స్ కూడా తెగ సంతోషపడుతున్నారు. తాజాగా సీతారామం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మికని ఇంటర్వ్యూ చేశాడు బిత్తిరి సత్తి. ఈ ఇంటర్వ్యూలో రష్మిక ఎపుడూ నవ్వనంతగా నవ్వింది. బిత్తిరి సత్తి మాటలకి రష్మిక నవ్వు ఆపుకోలేకపోయింది. సత్తి అడిగిన ప్రతి ప్రశ్నకి అతనిలాగానే సమాధానాలు చెప్పడానికి ట్రై చేసింది. చాలా క్యూట్ గా సమాధానాలు చెప్పడంతో ఈ ఇంటర్వ్యూ బాగా వైరల్ గా మారింది. రష్మిక అభిమానులు ఈ ఇంటర్వ్యూ చూసి ఫుల్ జోష్ లో ఉన్నారు.

Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

ఈ ఇంటర్వ్యూలో రష్మిక పలు విషయాలని షేర్ చేసుకుంది. మందన్న చాలా కష్టంగా ఉంది, నిన్ను యేమని పిలవాలి అంటే రష్, రోజ్, క్రష్ అని పిలువు అంది. అందరూ నిన్ను క్రష్మిక అని పిలుస్తారంట కదా అని అడిగితే అవును బన్నీ సర్ నాకు ఆ పేరు పెట్టారు అంది. రష్మిక మాట్లాడుతూ.. నాలుగైదు భాషల సినిమాల్లో నటించేసరికి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంటే పిచ్చెక్కుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ వచ్చు. రోజు షూటింగ్స్ అయ్యాక ఒక గంట క్లాస్ చెప్పించుకుంటున్నాను అని తెలిపింది. ఇక సెట్ లో డైరెక్టర్ హను రాఘవపూడి గట్టిగా అరుస్తారు మైక్ లో, నేను సర్ దగ్గరికి వెళ్లి నా హార్ట్ అసలే వీక్ కొంచెం మెల్లిగా అరవండి సర్ అని చెప్తాను అని తెలిపింది. ఇక ఫుల్ బిజీగా ఉన్నావు కదా 24 గంటలు సరిపోతున్నాయా అని సత్తి అడిగితే లేదు 36 గంటలు కావాలి అని ఫన్నీగా చెప్పింది రష్మిక. రష్యాలో షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఫుల్ చలి, చేతులు గడ్డకట్టుకుపోయినట్టు అయ్యేవి అని తెలిపింది. మరి అక్కడ వేడిగా ఉండటానికి అక్కడ మందు తాగావా అని సత్తి అడగటంతో అంత సీన్ లేదు అక్కడ అని నవ్వేసింది.

ఇక కాశ్మీర్ కూడా వెళ్తే నా పని అయిపోయేది, చాలా చలిలో షూట్ చేశారంట అని చెప్పింది. బిత్తిరి సత్తి ఈ సినిమాలోని ఒక సాంగ్ పాడటంతో నేను మిమ్మల్ని పాడిస్తాను, సింగర్ గా రికమండేషన్ చేస్తాను అని అన్నారు. ఏం తింటావు అని సత్తి అడిగితే మా డైటీషియన్స్, జిమ్ ట్రైనర్స్ ఇచ్చినవి తింటాను అని చెప్పింది. రష్మిక డబ్బింగ్ చెప్పేటప్పుడు తన పార్ట్ వరకే చెప్పానని, ట్రైలర్ మాత్రమే చూశాను, సినిమా చూడలేదు, చూడాలి మీ అందరితో కలిసి అని తెలిపింది. ఇద్దరి బర్త్ డే ఒకే రోజని బిత్తిరి సత్తి చెప్పడంతో అవునా అని ఆశ్చర్యపోయి హైఫై ఇచ్చింది రష్మిక. ఇక సత్తి రష్మికాని తెగ పొగిడేయడంతో నవ్వుతూ చాలు చాలు అని సత్తిని కూడా పొగిడింది. ప్రతి ప్రశ్నకి రష్మిక ఫుల్ గా నవ్వుతూనే ఉంది. దీంతో రష్మిక ఈ రేంజ్ లో ఇప్పటిదాకా నవ్వలేదు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు.