RGV: నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

ఎప్పుడూ వివాదాల వెంట తిరిగే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పుడెప్పుడో తన క్రియేటివిటీని నమ్ముకొని సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఆ క్రియేటివిటీకి వివాదాలను జోడించి సినిమాలను..

RGV: నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

Rgv (1)

RGV: ఎప్పుడూ వివాదాల వెంట తిరిగే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పుడెప్పుడో తన క్రియేటివిటీని నమ్ముకొని సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఆ క్రియేటివిటీకి వివాదాలను జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన కొండా మురళీ, సురేఖ బయోపిక్‌గా ‘కొండా’ సినిమాని ఎనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టిన వర్మ.. ఒక్క కొండాలో మాత్రమే కాదు అసలు తన కథలో ఎక్కడా హీరోలు ఉండరని.. కేవలం పాత్రలే ఉంటాయని.. అది కూడా కొండా సినిమాలో తాను నమ్మిన నిజమే హీరో అన్నారు.

RGV: అమ్మాయిలంటే ఇష్టం.. లెస్బియన్స్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం!

ఇక, ఈ సినిమా విషయంలో వరంగల్‌కి చెందిన ప్రముఖ పొలిటిషీయన్‌ నుంచి బెదిరింపులు వచ్చిన మాట నిజమేనన్న వర్మ.. ‘నల్ల బల్లి సుధాకర్’ అనే పేరుతో వార్నింగ్‌ ఇచ్చినట్లు చెప్పాడు. నల్ల బల్లి సుధాకర్ అనే పాత్ర కూడా తన సినిమాలో ఉందన్న వర్మ.. అసలు ఈ బెదిరింపుల తర్వాతే ఈ పాత్ర పెట్టాలని బలంగా ఫీల్ అవుతున్నానని.. ఇలాంటి సంఘటనలే తన కథని చెప్పాడు. రక్త చరిత్ర నుండి వంగవీటి వరకు.. ప్రతి సినిమా కథ ఇలా వ్యక్తులు, సమాజంలో వారి ప్రభావం ఆధారంగానే తన సినిమాలు ఉంటాయన్నారు.

RGV: కొండా.. ఓ డైనమిక్ పర్సనాలిటీ.. అందుకే సినిమా

ఇక, తన సినిమాల వలన ఇబ్బంది కలుగుతుందనే వాళ్ళ గురించి అసలు తాను పట్టించుకోనన్న ఆర్జీవీ.. అసలు ఈ లోకంలో ఏది చెప్పినా.. ఎలాంటి సినిమా చేసినా ఎవరొకరికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుందని.. తన సినిమా కోసం అలాంటి వారి ఎంతమంది ఉన్నారన్నది తాను అసలు ఊహించుకోనని.. అందుకే వారి గురించి పట్టించుకోనని చెప్పారు. మనం నోరు విప్పి మాట్లాడితే ఎవరొకరి హార్ట్ అవుతారని.. అలాంటిది సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి సినిమా అంటే ఎవరొకరు నొప్పి కలుగుతుందని.. అలా నొప్పి కలిగిన వాళ్ళని కూడా ఈ సినిమాలో చూపిస్తానని చెప్పారు.