Kantara: కాంతార తొలి హీరో రిషబ్ కాదా.. ఆయన అయి ఉంటే వేరే లెవెల్..!

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేస్తుందో మనం చూస్తున్నాం. హీరో రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను తీసుకెళ్లిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోగా రిషబ్ శెట్టిని అనుకోలేదట చిత్ర యూనిట్.

Kantara: కాంతార తొలి హీరో రిషబ్ కాదా.. ఆయన అయి ఉంటే వేరే లెవెల్..!

Rishab Shetty Was Not The First Choice For Kantara

Kantara: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేస్తుందో మనం చూస్తున్నాం. హీరో రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను తీసుకెళ్లిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకు వారు చూపిస్తున్న ఆదరణ అమోఘం అని చిత్ర యూనిట్ కొనియాడుతోంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Kantara : కాంతార సినిమా టీంకి షాకిచ్చిన కోర్టు.. వరాహరూపం పాట ప్రదర్శన నిలిపివేయాలని నోటీసులు..

రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా, ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు వసూళ్లతో దుసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో తొలుత హీరోగా రిషబ్ శెట్టిని అనుకోలేదట చిత్ర యూనిట్. ఈ సినిమా కథను ఎలాగైనా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో తెరకెక్కించాలని రిషబ్ శెట్టి భావించాడట. అయితే ఆయన ఈ సినిమా కథ గురించి తెలుసుకుని, ఈ సినిమా రిషబ్ శెట్టి పుట్టిపెరిగిన ప్రాంతానికి చెందిన సంప్రదాయం కావడంతో, ఆయన అయితేనే ఈ సినిమాను బాగా చేస్తాడని సూచించాడట.

Kantara : కర్ణాటకలో కాంతార సినిమా చూస్తూ గుండెపోటుతో 45 ఏళ్ళ వ్యక్తి కన్నుమూత..

దీంతో రిషబ్ శెట్టి ఈ సినిమాలో చెలరేగిపోయి నటించాడు. కానీ, ఈ సినిమాలో ఒకవేళ నిజంగానే పునీత్ రాజ్‌కుమార్ నటించి ఉంటే, ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌లో ఉండేదని కన్నడ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మరో విశేషమేమిటంటే, ఈ సినిమా కోసం సెట్స్‌తో పాటు సినిమా షూటింగ్‌ను తన సొంతూరులోనే ఎక్కువగా తెరకెక్కించాడట రిషబ్ శెట్టి. ఏదేమైనా తమ సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు రిషబ్ శెట్టి ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించడం.. అది ప్రేక్షకుల మన్ననలను అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని అందరూ అంటున్నారు.