Kantara : కాంతార సినిమా టీంకి షాకిచ్చిన కోర్టు.. వరాహరూపం పాట ప్రదర్శన నిలిపివేయాలని నోటీసులు..

కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో 'వరాహ రూపం' పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాటని అన్ని.............

Kantara : కాంతార సినిమా టీంకి షాకిచ్చిన కోర్టు.. వరాహరూపం పాట ప్రదర్శన నిలిపివేయాలని నోటీసులు..

Court Notices to Kantara Team regarding Varaharoopam song copy rights

Kantara :  రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదట కన్నడలో రిలీజయి మంచి విజయం సాధించిన తర్వాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో వరాహ రూపం పాటకి వాడిన మ్యూజిక్ మాదే, మా మ్యూజిక్ ని కాపీ కొట్టారు, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ కర్ణాటకకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే కోర్టులో పిల్ వేసింది. వరాహరూపం పాటకి వాడిన మ్యూజిక్ మాదే అంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ కాంతార చిత్ర యూనిట్ పై పలు ఆరోపణలు చేసి కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టులో పిల్ వేయగా విచారించిన కోర్టు దీనిపై తీర్పునిస్తూ కాంతార టీంకి షాకించ్చింది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం తయారీ తెనాలిలో.. నవంబర్ 1న కర్ణాటకలో ఆవిష్కరణ..

కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో ‘వరాహ రూపం’ పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాటని అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు.. అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్, మరియు ఇలాంటి వాటిల్లో పూర్తిగా నిలిపివేయాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, కోజికోడ్ ఆదేశాలిచ్చారు. అయితే దీనిపై కాంతార చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. ఆ పాటని అన్నిట్లో తీసివేసే విధంగా కాంతార చిత్ర యూనిట్ చర్చలు చేపట్టనున్నట్టు సమాచారం.