Sailesh Kolanu: సైంధవ్.. మామూలుగా ఉండదంటోన్న డైరెక్టర్..!

టాలీవుడ్‌లో హిట్ సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను, తన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ హిట్-2 మూవీతోనూ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన హిట్ వర్స్‌లో హిట్ మూడో సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Sailesh Kolanu: సైంధవ్.. మామూలుగా ఉండదంటోన్న డైరెక్టర్..!

Sailesh Kolanu Assures Venkatesh Saindhav Movie Will Be Blockbuster

Sailesh Kolanu: టాలీవుడ్‌లో హిట్ సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను, తన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ హిట్-2 మూవీతోనూ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన హిట్ వర్స్‌లో హిట్ మూడో సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Sailesh Kolanu : పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 లోడింగ్.. ముగ్గురి హీరోలతో డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..

కాగా, ఈ సినిమా కంటే ముందే మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా, తాజాగా నేడు సైంధవ్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ క్రమంలోనే నెటిజెన్లు శైలేష్ కొలనుకు ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. కాగా, ఓ నెటిజెన్ ఈ సినిమా వెంకీ కెరీర్‌లో బెస్ట్ మూవీగా తెరకెక్కించాలని శైలేష్‌కు ట్వీట్ చేశాడు.

Sailesh Kolanu : అడివిశేష్ తో సినిమా తీయొద్దన్నారు.. కథలో వేలు పెడతాడు అని చెప్పారు..

దీంతో శైలేష్ ఆ నెటజెన్‌కు రిప్లై ఇస్తూ.. తాను దర్శకుడిగా మారింది వెంకటేష్ కోసమేనా అనిపిస్తుందని.. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని తాను కోరుకుంటున్నట్లుగా శైలేష్ తెలిపాడు. ఈ సినిమాలో వెంకటేష్‌ను చూసి ఆయన అభిమానులు గర్వపడేలా చేస్తానంటూ శైలేష్ చెప్పుకొచ్చాడు. దీంతో వెంకీ ఫ్యాన్స్ శైలేష్ కొలనుకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.