తెరపైకి రానున్న సమంత-శర్వానంద్‌ల ప్రేమ కథ

తెరపైకి రానున్న సమంత-శర్వానంద్‌ల ప్రేమ కథ

చాలా రోజులుగా సినీ ప్రపంచంలో నలుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరకనుంది. రీమేక్ చిత్రం ద్వారా శర్వానంద్, సమంతలు కలసి పనిచేయబోతున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘96’ సినిమాలో విజయ్‌ సేతుపతి, త్రిష పాత్రలలో శర్వా, సమంతాలు కనిపించనున్నారు. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు వహించనున్నారు. 

దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో భావోద్వేగాల సమ్మిళితంగా చిత్రం రూపొందనుంది. ‘ఈ పాత్రలకు శ్యామ్, శర్వాలు చక్కగా సరిపోతారని ఎంచుకున్నాం. చిత్ర షూటింగ్ మార్చి నెల నుంచి మొదలుపెట్టనున్నాం’ అని చిత్ర బృందం తెలిపింది.