Satya Dev : చిరంజీవి అన్నయ్య భోజనానికి పిలిచి కథ చెప్తే ఒప్పుకోకుండా ఉంటామా??

సత్యదేవ్ మాట్లాడుతూ.. ''అన్నయ్య ఒక షూటింగ్‌లో లంచ్‌కి రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఆ సమయంలో నాకు చిరంజీవి అన్నయ్యే స్వయంగా................

Satya Dev : చిరంజీవి అన్నయ్య భోజనానికి పిలిచి కథ చెప్తే ఒప్పుకోకుండా ఉంటామా??

Satya Dev shares Interesting Fact about God father Movie

Satya Dev :  మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్‌ కానుంది. తాజాగా బుధవారం నాడు అనంతపురంలో గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని నిర్వహించారు. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సత్యదేవ్ మాట్లాడుతూ.. ”అన్నయ్య ఒక షూటింగ్‌లో లంచ్‌కి రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఆ సమయంలో నాకు చిరంజీవి అన్నయ్యే స్వయంగా గాడ్ ఫాదర్ కథ చెప్పి, నా పాత్ర గురించి కూడా చెప్పారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్యకి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని చూసి నటుడ్ని అవ్వాలనుకున్నాను, ఆయనతో కలిసి నటించాలనుకున్నాను. అందుకే చిరంజీవి అన్నయ్య చెప్పగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో నా నటనని అన్నయ్య ప్రశంసించడం అదో గొప్ప అనుభూతి. ఆయనతో నటించాలనే నా కల ‘గాడ్‌ఫాదర్‌’తో నెరవేరింది.”

Chiranjeevi : నేనొప్పుడొచ్చినా ఈ సీమ నేల తడుస్తుంది.. రామ్ చరణ్ చెప్తేనే ఈ సినిమా చేశా.. వర్షంలోనూ మెగాస్టార్ స్పీచ్

”నేను ఆరాధించిన వ్యక్తి నన్ను పిలిచి కథ చెప్పి, నా పాత్ర చెప్తుంటే ఆ రోజంతా ఆశ్చర్యపోయా. కానీ ఆ పాత్ర చేసేటప్పుడు చిన్న టెన్షన్ ఉంది. నటుడిగా అన్నయ్య నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాననే అనుకుంటున్నాను. ఇప్పటివరకు చేయని పాత్ర ఇందులో చేశాను. అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ‘గాడ్‌ఫాదర్‌’. చిరంజీవి గారిని మెగాస్టార్‌ అని ఎందుకు అంటారో ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత అర్థమైంది.” అని తెలిపారు. ఈ సినిమాని స్క్రీన్ మీద చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.