Jawan : ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం.. జవాన్ ఆఫర్ అందుకోసమేనా..?
ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ జవాన్ మూవీ టీం ఆఫర్ ప్రకటించడం వెనుక రీజన్ ఏంటి..?

Shah Rukh Khan Jawan movie buy 1 get 1 ticket free offer
Jawan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. షారుఖ్ గత సినిమా ‘పఠాన్’ రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరడానికి చాలా కష్టపడింది. కానీ ఈ చిత్రం మూడు వారంలోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. అయితే మూవీ టీం తాజాగా ఒక ఆఫర్ ఇచ్చింది.
Allu Arjun : క్రిష్ జాగర్లమూడితో అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా..?
ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ నేడు సెప్టెంబర్ 28 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఆఫర్ ని ఉపయోగించుకొని.. అసలు చూడని వారు, ఆల్రెడీ చూసిన వారు మరోసారి సినిమా చూసేయండి. అయితే జవాన్ టీం ఇప్పుడు ఈ ఆఫర్ ప్రకటించడం వెనుక.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కలెక్షన్స్ ని క్రాస్ చేయాలనే ఆలోచన ఉందా..? అనే సందేహం కలుగుతుంది. వరల్డ్ వైడ్ గా KGF – 1200 కోట్లకు పైగా, RRR – 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నాయి.
View this post on Instagram
కేజీఎఫ్ రికార్డుని అన్న క్రాస్ చేయాలని మూవీ టీం చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సౌత్ లో ప్రస్తుతం చాలా సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. దీంతో సౌత్ లో ఈ మూవీకి కలెక్షన్స్ రావడం కష్టమే. ఒక్క నార్త్ లోనే ఈ మూవీ మరో 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే కష్టమే అని చెప్పాలి. మరి ఈ ఆఫర్ వల్ల ఈ మూవీ ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. కాగా అట్లీ ఈ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తాను అంటూ కూడా ప్రకటించాడు. మరి అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.