Allu Arjun : క్రిష్ జాగర్లమూడితో అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా..?
అల్లు అర్జున్, క్రిష్ జాగర్లమూడితో బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడా..? 'కబీ అప్నే, కబీ సప్నే' అంటూ టైటిల్ కూడా..

Allu Arjun Krish Jagarlamudi Bollywood film photo gone viral is it true
Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తుంది. ఆ తరువాత త్రివిక్రమ్, సందీప్ వంగా చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మరో దర్శకుడు ఈ లైన్ లోకి వచ్చాడు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ రెండు లుక్స్ తో ఉన్న ఆ ఫోటోలో.. ‘కబీ అప్నే, కబీ సప్నే’ ఏ ఫిలిం బై క్రిష్. త్వరలో రాబోతుందంటూ సమాచారం కనిపిస్తుంది.
ఇక ఇది చూసిన నెటిజెన్స్ అల్లు అర్జున్, క్రిష్ కలిసి బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారా..? అనే సందేహం మొదలైంది. కాగా క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం క్రిష్ ఖాళీగానే ఉంటున్నాడు. ఇక ఈ గ్యాప్ రావడంతో ఆ మధ్య వైష్ణవ తేజ్ తో ‘కొండా పొలం’ అనే సినిమాను తెరకెక్కించాడు. మరి ఇప్పుడు అల్లు అర్జు తో కూడా మరో మూవీ తెరకెక్కిస్తున్నాడా..? అనే సందేహం కలుగుతుంది.
Chandramukhi 2 Twitter Review : రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ట్విటర్ టాక్ ఏంటి..?
కాగా వీరిద్దరి కలయికలో గతంలో ‘వేదం’ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు నిజంగా ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కబోతుందా లేదా చూడాలి. అయితే ఇది ఓటీటీ కంటెంట్ అయ్యి ఉండవచ్చని తెలుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్, అల్లు అర్జున్ కూడా ‘ఆహా’ కోసం ఒక యాడ్ షూట్ చేశారు. దానికి ముందు సినిమా అంటూ ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది కూడా అలాంటిదే అయ్యి ఉంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో పక్క పవన్ అభిమానులు.. వీరమల్లు సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.