Guppedantha Manasu Serial : జగతిని అమ్మా అని పిలిచిన రిషి.. ‘గుప్పెడంత మనసు సీరియల్‌’లో మనసు బరువెక్కించిన సీన్

ఆసుపత్రి బెడ్‌పై స్పృహ లేకుండా ఉన్న జగతిని రిషి 'అమ్మా' అని పిలుస్తాడు. తనని క్షమించమని అడుగుతాడు. రిషి పిలుపుకి జగతి కళ్లు తెరుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది?

Guppedantha Manasu Serial : జగతిని అమ్మా అని పిలిచిన రిషి.. ‘గుప్పెడంత మనసు సీరియల్‌’లో మనసు బరువెక్కించిన సీన్

Guppedantha Manasu Serial

Updated On : September 28, 2023 / 1:42 PM IST

Guppedantha Manasu Serial : రిషి తల్లి జగతి పట్ల ప్రవర్తించిన తీరుకి కుమిలిపోతాడు. తల్లిని తల్చుకుని పెద్దమ్మ దేవయాని దగ్గర కన్నీరు పెట్టుకుంటాడు. ఈలోపు రిషిని కలవడానికి పోలీసులు వస్తారు. ఆ తరువాత ఏం జరిగిందంటే?

‘గుప్పెండంత మనసు’ సీరియల్ ఈ ఎపిసోడ్ భావోద్వేగాలతో నిండిపోయింది. ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్న వసుధర దగ్గరకి వచ్చి శైలేంద్ర బెదిరిస్తాడు. చేసిన పాపాలకు తగిన శిక్ష పడుతుంది అన్న వసుధరతో తను ఎన్ని హత్యలకు చేయడానికైనా వెనుకాడనని, శిక్షలకు బెదిరిపోనని చెప్పాడు. ఈలోపు అక్కడికి వచ్చిన రిషి ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? పదండి అంటూ వారిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు.

Guppedantha Manasu Serial : ఆసుపత్రిలో ఉన్న జగతి ప్రాణాలతో బయటపడుతుందా? గుప్పెడు మనసు సీరియల్‌లో ఏం జరగబోతోంది?

ఆసుపత్రిలో అందరూ ఆందోళనలో ఉంటారు. రిషికి తను జగతిని అవమానించిన సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. అవి తల్చుకుని ఆవేదనకు గురవుతాడు. పెద్దమ్మ దేవయానితో జగతిని అమ్మా అని పిలవాలని ఉందని.. తన తల్లికి ఏం కాదు కదా? అని ప్రశ్నిస్తాడు. గతం తాలుకూ జ్ఞాపకాలు గుర్తొచ్చి జగతిని దూరంగా పెట్టానని.. తను ఏం చేస్తే తన తల్లి రుణం తీర్చుకోగలనని అడుగుతాడు. దేవయాని రిషిని ఓదార్చినట్లు నటిస్తుంది. రిషిని కలవడానికి పోలీసులు రావడంతో  బయటకు వెళ్తాడు.

పోలీసులు రావడం చూసి శైలేంద్రలో వణుకు మొదలవుతుంది. రిషి వెనకాల తను కూడా బయటకు వెళ్తాడు. జగతిపై అటాక్ జరిగిన ప్రాంతంలో సీసీటీవీలో ఒక వ్యక్తి అనుమానాస్పందగా కనిపించాడని అతనిని త్వరలో పట్టుకుంటామని రిషికి పోలీసులు చెబుతారు. శైలేంద్ర కూడా ఏమీ ఎరగనట్లు నిందితుడిని త్వరగా పట్టుకోండి అంటూ నటిస్తాడు. అదే సమయంలో జగతిపై కాల్పులు జరిపిన వ్యక్తి నుంచి శైలేంద్రకు ఫోన్ వస్తుంది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు కోసం అతను అడుగుతాడు. అందుకు శైలేంద్ర తనే స్వయంగా వచ్చి కలుస్తానని అతనికి చెబుతాడు.

Guppedantha Manasu Serial : జగతిని మొదటిసారి అమ్మ అని సంబోధించిన రిషి.. వసుధర అసలు నిజాలు రిషికి చెప్పేస్తుందా?

రిషి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న జగతి దగ్గర కూర్చుని ఆవేదన చెందుతాడు. జగతిని క్షమించమని అడుగుతాడు. తాను బ్రతికున్నంతకాలం అమ్మా అని పిలుస్తాను.. కళ్లు తెరువు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. అక్కడి నుంచి రిషి, వసుధర, మహేంద్ర వెళ్లబోతున్నంతలో జగతి కళ్లు తెరుస్తుంది. రిషిని పిలుస్తుంది. మరోసారి తనను అమ్మా అని పిలవమంటుంది. అక్కడ సీన్ ఫుల్ ఎమోషనల్‌గా మారిపోయింది. ఇక తరువాత ఏం జరగబోతోంది? నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతోంది.