Singer Komali : ఇక ‘సారంగ దరియా’ పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. సింగర్ కోమలి..

‘సారంగ దరియా’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ పాటే.. పిల్లలనుండి పండు ముసలి వరకు అందరూ ఈ జానపద గేయానికి ఫిదా అయిపోయారు.. ఇప్పటికీ యూట్యూబ్‌ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుందీ సాంగ్..

Singer Komali : ఇక ‘సారంగ దరియా’ పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. సింగర్ కోమలి..

Singer Komali

Singer Komali: ‘సారంగ దరియా’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ పాటే.. పిల్లలనుండి పండు ముసలి వరకు అందరూ ఈ జానపద గేయానికి ఫిదా అయిపోయారు.. ఇప్పటికీ యూట్యూబ్‌ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుందీ సాంగ్.. ఈ పాట ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే త్వరగా వివాదల్లో చిక్కుకుంది. ఈ పాట నేనే పాడానంటూ కోమలి మీడియా ముందు బాధపడుతూ చెప్పింది. పని బిజీలో ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవల ఈ వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఫేస్‌బుక్‌లో వివరంగా పోస్ట్ చేశారు.

‘సారంగ దరియా’ వివాదం గురించి క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల..

ఎట్టకేలకు ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ‘సారంగ దరియా’ పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి ‘సారంగ దరియా’ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. బుధవారం దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ప్రకటన చేసింది.
గాయని కోమలి మాట్లాడుతూ… ‘‘సారంగ దరియా’ పాట ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాను. ‘రేలారె రేలా’ ద్వారా ‘సారంగ దరియా’ పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొవరతో ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయే సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే ‘లవ్ స్టోరీ’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద ‘సారంగ దరియా’ పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ‘సారంగ దరియా’ పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’.. అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… ‘‘ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్‌లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్‌లను నిలబెట్టుకుంటానని చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను’’.. అన్నారు.