Singer Sunitha : నా పర్సనల్ విషయాలు మీకెందుకు.. యాంకర్ పై ఫైర్ అయిన సింగర్ సునీత..

ఇంటర్వ్యూలో.. ఈ వయసులో మీకు రెండో పెళ్లి అవసరమా అంటూ మీపై ట్రోల్స్‌ వచ్చాయి కదా, దానికి మీరేమంటారు అని యాంకర్ అడగడంతో సునీత దానికి సమాధానమిస్తూ...............

Singer Sunitha : నా పర్సనల్ విషయాలు మీకెందుకు.. యాంకర్ పై ఫైర్ అయిన సింగర్ సునీత..

Singer Sunitha fires on anchor for asking personal questions

 

Singer Sunitha :  టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో ఒకరు సునీత. తన అద్భుతమైన గాత్రంతో, ఎన్నో వందల పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలు, తనకి సంబంధించిన విశేషాలు, పాటలు అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

ఆ సమయంలో ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వయసులో పెళ్లి అవసరమా, రెండో పెళ్లి ఎందుకు, ఎందుకు చేసుకున్నారు అంటూ ట్రోల్స్ చేశారు. అయితే గతంలోనే వీటికి గట్టిగా సమాధానం చెప్పింది సునీత. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రెండోపెళ్లిపై ప్రశ్నలు అడగడంతో సీరియస్ అయింది సునీత.

Vishnu Priya : ఇండస్ట్రీలో మగవాళ్ల డామినేషన్.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. నన్ను యాంకర్ అని పిలవకండి..

ఇంటర్వ్యూలో.. ఈ వయసులో మీకు రెండో పెళ్లి అవసరమా అంటూ మీపై ట్రోల్స్‌ వచ్చాయి కదా, దానికి మీరేమంటారు అని యాంకర్ అడగడంతో సునీత దానికి సమాధానమిస్తూ.. నేను చాలా సినిమాలకి పాటలు పాడాను, డబ్బింగ్ చెప్పాను. వాటి గురించి అడగకుండా నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. మంచి విషయాలు, కెరీర్ గురించి అడగొచ్చు కదా. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి అడిగితే మంచిది” అని యాంకర్ పై సీరియస్ అయింది.