SIR Movie: పాఠం కాదు.. గుణపాఠం చెబుతున్న సార్!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే తమిళంతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

SIR Movie: పాఠం కాదు.. గుణపాఠం చెబుతున్న సార్!

SIR Movie New Poster On Diwali

SIR Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే తమిళంతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

Sir Movie: సార్.. డిసెంబర్‌లో టెండర్ పెడుతున్నారా?

కాగా, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా.. తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా నుండి ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ‘సార్’ రౌడీ మూకకు పాఠం కాకుండా గుణపాఠం నేర్పుతూ కనిపించాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్‌లోని ఈ స్టిల్‌లో స్టైలిష్ లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ధనుష్ పాత్ర అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.