Sir Movie: సార్.. డిసెంబర్‌లో టెండర్ పెడుతున్నారా?

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. యూత్ మెచ్చే సినిమాలను చేస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ హీరో తొలిసారి సార్ అనే స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Sir Movie: సార్.. డిసెంబర్‌లో టెండర్ పెడుతున్నారా?

Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. యూత్ మెచ్చే సినిమాలను చేస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రఘువరన్ బిటెక్ చిత్రంతో ధనుష్‌కు తెలుగునాట కూడా అదిరిపోయే పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా తరువాత ధనుష్ చేసే ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

కాగా, తాజాగా ఈ హీరో తొలిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ బైలింగ్వెల్ మూవీలో ధనుష్ నటిస్తున్నాడు. తమిళంలో వాతి, తెలుగులో సార్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ధనుష్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

అయితే, సార్ చిత్రానికి సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కార్పొరేట్ విద్యా విధానం వర్సెస్ ప్రభుత్వ విద్యా విధానం కాన్సెప్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సంయుక్తా మీనన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాను నిజంగానే డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.