Aadi Keshava : ఆదికేశవ ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సిత్తరాల సితారావతి శ్రీలీల అంటూ వైష్ణవ..

వైష్ణవ తేజ్, శ్రీలీల కలిసి నటిస్తున్న ఆదికేశవ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Aadi Keshava : ఆదికేశవ ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సిత్తరాల సితారావతి శ్రీలీల అంటూ వైష్ణవ..

Sittharala Sitharavathi Song Promo release from Aadi Keshava

Updated On : September 6, 2023 / 4:28 PM IST

Aadi Keshava : మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) నటిస్తున్న నాలుగో సినిమా ‘ఆదికేశవ’. మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వైష్ణవకి జోడిగా ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు. గతంలో ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి తెరలేపారు. ఈక్రమంలోనే సినిమా నుంచి మొదటి సింగల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Naresh-Pavitra : మరోసారి స్టేజిపై నరేష్, పవిత్ర సందడి.. ముద్దులు, ముద్దు పేరులతో..

‘సిత్తరాల సితారావతి’ సాగే ఈ పాటను జివి ప్రకాష్ కంపోజ్ చేశాడు. సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రోమో చివరిలో వైష్ణవ అండ్ శ్రీలీల వేసిన గ్రేస్ స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ లిరికల్ సాంగ్ సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కాగా ఈ మూవీ స్టోరీ ఒక గుడి చుట్టూ తిరగబోతుందని తెలుస్తుంది. వైష్ణవ తేజ్ నటించిన గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. మరి ఈ మూవీ తనకి హిట్టుని అందించి సక్సెస్ ట్రాక్ ని ఎక్కిస్తుందా..? అనేది చూడాలి.

Parineeti Chopra-Raghav Chadha : పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మ్యారేడ్ డేట్ ఫిక్స్? డెస్టినేషన్ ఎక్కడంటే..

Prabhas Movies : ప్రభాస్ ప్రతి సినిమా వాయిదానే.. బాహుబలి నుంచి ఇదే తీరు..

సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ఆగష్టులోనే రావాల్సి ఉంది. కానీ ఎందుకో పోస్ట్‌పోన్ చేశారు. నవంబర్ 10న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు.