Special Fan Shows : ఇకపై ఫ్యాన్ షోస్, బెనిఫిట్ షోలు బ్యాన్.. కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం..

నిమాలని ఎంజాయ్ చేసేంతవరకు పర్వాలేదు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మితిమీరి థియేటర్ ప్రాపర్టీకి నష్టం చేకూరుస్తారు. సీట్స్ విరగ్గొట్టడం, స్క్రీన్ చింపడం, థియేటర్లోని సామాగ్రిని బ్రేక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు నష్టపోతారు. ఇలా..................

Special Fan Shows : ఇకపై ఫ్యాన్ షోస్, బెనిఫిట్ షోలు బ్యాన్.. కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం..

kakinada theaters

 

Special Fan Shows :  హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఆ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బెనిఫిట్ షోలు అంటూ హడావిడి చేస్తారు ఫ్యాన్స్. ఇక అహీరోల బర్త్ డే లకి స్పెషల్ షోలు అంటూ, ఫ్యాన్ షోలు అంటూ పాత సినిమాలు థియేటర్స్ లో వేసి రచ్చ చేస్తారు ఫ్యాన్స్. అయితే సినిమాలని ఎంజాయ్ చేసేంతవరకు పర్వాలేదు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మితిమీరి థియేటర్ ప్రాపర్టీకి నష్టం చేకూరుస్తారు. సీట్స్ విరగ్గొట్టడం, స్క్రీన్ చింపడం, థియేటర్లోని సామాగ్రిని బ్రేక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు నష్టపోతారు. ఇలా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇటీవల మహేష్ పుట్టిన రోజు నాడు పోకిరి రీరిలీజ్ చేస్తూ కొన్ని థియేటర్స్ లో విడుదల చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తో థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొంతమంది ఫ్యాన్స్ అతి ఉత్సాహం చూపించి థియేటర్ లోని సామగ్రిని బ్రేక్ చేస్తూ నష్టం కలిగించారు. కాకినాడలోని ఓ థియేటర్లో భారీ నష్టం చేకూర్చారు ఫ్యాన్స్. గతంలో కూడా ఇలా జరగడం, ఈ సారి మరింత జరగడంతో కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒక లేఖని విడుదల చేశారు.

Vishwaksen : కాలేజీలో నిహారికకు భయపడేవాడ్ని.. మెగా లేడీ ప్రొడ్యూసర్ అయింది.. నిహారికపై విశ్వక్ సేన్ సెటైర్లు..

ఈ లేఖలో.. ”ఇకపై కాకినాడలో, కాకినాడ పరిసర ప్రాంతాల్లో, కాకినాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లో ఉన్న అన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నాము. ఏ థియేటర్ వాళ్ళైనా ఈ నిర్ణయాన్ని దాటి షోలు వేస్తే లక్ష రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది” అని తెలిపారు. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. త్వరలో ఘరానా మొగుడు, జల్సా సినిమాలు కూడా రీరిలీజ్ ఉన్న సమయంలో కాకినాడ ఎగ్జిబిటర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.