Vishwaksen : కాలేజీలో నిహారికకు భయపడేవాడ్ని.. మెగా లేడీ ప్రొడ్యూసర్ అయింది.. నిహారికపై విశ్వక్ సేన్ సెటైర్లు..

విశ్వక్ సేన్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ''నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను. అక్కడ కాలేజిలో నేను ఎవ్వరికి భయపడేవాడ్ని కాదు. కానీ నిహారిక కొణిదెల అని ఒక సీనియర్ ఉండేది. తనకి మాత్రం భయపడేవాడ్ని. అప్పట్లో..........

Vishwaksen : కాలేజీలో నిహారికకు భయపడేవాడ్ని.. మెగా లేడీ ప్రొడ్యూసర్ అయింది.. నిహారికపై విశ్వక్ సేన్ సెటైర్లు..

Vishwaksen counters on Niharika

Vishwaksen :  మెగా డాటర్ నిహారిక కొణిదల యాంకర్ గా, యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు నిర్మాతగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది. ఇటీవలే తను నిర్మించిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ జీ5 లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ లాంచింగ్ కి విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా వచ్చాడు. విశ్వక్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నిహారిక గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.

విశ్వక్ సేన్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను. అక్కడ కాలేజిలో నేను ఎవ్వరికి భయపడేవాడ్ని కాదు. కానీ నిహారిక కొణిదెల అని ఒక సీనియర్ ఉండేది. తనకి మాత్రం భయపడేవాడ్ని. అప్పట్లో ఏయ్ అంటూ బెదిరించేది. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏయ్ అని అనగానే ఇలా ఈవెంట్ కి వచ్చేశాను. నిహారిక మెగా లేడీ ప్రొడ్యూసర్‌ అయింది ఇప్పుడు” అని అన్నాడు.

Hareesh Shankar : తనికెళ్ళ భరణి ఇలా చెప్పారంటూ.. అనసూయ అందంపై స్టేజి మీదే హరీష్ శంకర్ కామెంట్స్..

దీంతో నిహారిక ఆపరా బాబు అంటూ విశ్వక్ తో అంది. ఇక విశ్వక్ మాట్లాడుతుండగా మధ్యలో మైక్ ఆగిపోతే నువ్వే మైక్ ఆపించావా? అంటూ నిహారిక మీద విశ్వక్ సేన్ సెటైర్లు వేశాడు. ఇలా సరదాగా మాట్లాడుతూ నిహారిక గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు విశ్వక్. గతంలో నిహారిక, విశ్వక్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.