Suchendra Prasad : పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..

సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. ''నా భార్యపై వస్తున్న వార్తలని మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా ఇటీవలే తెలుసుకున్నాను. పవిత్ర మేము సహజీవనం చేస్తున్నామని చెప్పిందట. కానీ మేము ఇద్దరం..

Suchendra Prasad :  పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..

Suchendra Prasad :  గత వారంరోజులుగా పవిత్రా లోకేష్, నరేశ్.. ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వారాలు వచ్చాయి. మొదట వీరిద్దరూ ఖండించినా తాజాగా ఆదివారం ఉదయం మైసూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ కనిపించారు. అక్కడికి నరేశ్ మూడో భార్య వెళ్లి పవిత్రని చెప్పుతో కొట్టబోయింది. ఇలా మరోసారి వీరిద్దరి వ్యవహారం మీడియాకి ఎక్కింది.

ఇక ఇటీవలే పవిత్రా లోకేష్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. నాకు అసలు వివాహమే జరగలేదు, సుచేంద్ర ప్రసాద్ తో కేవలం సహజీవనం చేశాను అని తెలిపింది. నిన్న మైసూరులో జరిగిన సంఘటన తర్వాత పవిత్రా భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ మీడియా ముందుకి వచ్చాడు.

NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..

సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. ”నా భార్యపై వస్తున్న వార్తలని మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా ఇటీవలే తెలుసుకున్నాను. పవిత్ర మేము సహజీవనం చేస్తున్నామని చెప్పిందట. కానీ మేము ఇద్దరం 16 ఏళ్ల క్రితమే హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అందుకు ఆధారాలు కూడా వున్నాయి. మా పాస్‌పోర్టు, ఆధార్‌కార్డులో కూడా భార్య‌ భ‌ర్త‌లుగా మా పేర్లు ఉంటాయి. మా ప్రేమకు, దాంప‌త్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను పవిత్రని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదు. పవిత్రపై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఈ వ్యవహారాల వెనుక ఎవరో ఉన్నారు. నాకు నరేశ్ ఎవరో కూడా తెలీదు” అని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నరేశ్ కానీ, పవిత్రా కానీ స్పందిస్తారేమో చూడాలి.