Superstar Krishna Last Rites Completed: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఎట్టకేలకు ముగిశాయి. మహాప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల అభివందనంతో మొదలైన కృష్ణ అంత్యక్రియలను, తమ ఆచారం ప్రకారం నిర్వహించారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. కృష్ణ అంత్యక్రియల్లో అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

krishna last rites completed
Superstar Krishna Last Rites Completed: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఎట్టకేలకు ముగిశాయి. మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారని తెలుసుకుని, యావత్ తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న నటశేఖరుడు ఇక మనమధ్య లేరనే వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
Superstar Krishna Last Rites: అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని నానక్ రాంగూడలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం 7 గంటల వరకు ఉంచారు. అభిమానులకు కూడా ఆయన సందర్శనకు అనుమతినిచ్చారు. ఇక ఉదయం 7 గంటలకు కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించి, అక్కడ మరికొంత మంది ప్రముఖులు, అభిమానులు సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు కొనసాగింది. ఈ అంతిమయాత్రలో సినిమా రంగంతో పాటు, రాజీకయ ప్రముఖులు హాజరుకాగా, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Krishna : చివరిసారిగా తాతయ్యకి నివాళ్లు అర్పించిన గౌతమ్ అండ్ సితార..
ఇక మహాప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల అభివందనంతో మొదలైన కృష్ణ అంత్యక్రియలను, తమ ఆచారం ప్రకారం నిర్వహించారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. కృష్ణ అంత్యక్రియల్లో అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తారలు ఎంతమంది ఉన్నా, నీలాంటి ధ్రువతార ఒక్కరే అంటూ కృష్ణను గుర్తుకుచేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ముగియడంతో, తెలుగు సినీ చరిత్రలో ఓ శకం ముగిసిందనే దుఃఖంతో అభిమానులు తిరుగుపయనం అయ్యారు.